సాధారణంగా ఏ నిర్మాత అయినా కూడా ఓ సినిమా తీయాలంటే కథను ఎంతో నమ్మాలి ? ఆ తర్వాత హీరో ఇమేజ్‌తో పాటు దర్శకుడిని కూడా నమ్మాలి. అప్పుడు ఆ సినిమా హిట్ అన్నదానిపై అందరికి ఓ కాన్పిడెంట్ ఉంటుంది. టాలీవుడ్లోనే టాప్ ప్రోడ్యుసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు జడ్జ్మెంట్ ఎలా ? ఉంటుందో ? తెలిసిందే. అలాంటిది దిల్ రాజు ఓ సినిమా చేయవద్దని పట్టుబట్టినా కూడా ఇద్దరు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు మాత్రం సినిమా హిట్ అవుతుందని పట్టుబట్టారట. అటు హీరో కూడా సినిమా హిట్ అవుతుందని కాన్పిడెంట్‌గా ఉండడంతో చివరకు తనకు ఇష్టం లేకపోయినా తన బ్యానర్లో రాజు ఈ సినిమాను నిర్మించారు.
తీరా ఫస్ట్ డే ఫస్ట్ షోకే సినిమా చూసిన దిల్ రాజు సినిమా కష్టమే అని చెప్పేశాడట. దిల్ రాజుకు సమీప బంధువు అయిన దర్శకుడు వంశీ పైడిపల్లి మున్నా సినిమాతో మెగాఫోన్ పట్టాడు. ఈ సినిమాకు మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ వర్క్ చేశారు. అయితే ఈ సినిమాకు ముందు దిల్ రాజుకు అన్ని సూపర్ హిట్లే ఉన్నాయి. ఇక మున్నా కథ విన్న దిల్ రాజు స్క్రిఫ్ట్ నచ్చలేదని చెప్పేశాడట. అయితే వంశీ పైడిపల్లి మాత్రం ఒప్పుకోలేదట.
సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెప్పాడట. అయితే వంశీ తనకు బంధువు కావడంతో పాటు అతడి ఉత్సాహాన్ని తాను ఎందుకు ? కాదనాలని రాజు ఓకే చెప్పాడట. అయితే ఈ సినిమాకు రైటర్‌గా ఉన్న కొరటాల శివ కూడా సినిమా సూపర్ అని చెప్పడంతో చివరకు రాజు అయిష్టంగానే సినిమా నిర్మించడానికి రెడీ అయ్యాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూసిన రాజుకు రిజల్ట్ ఏంటో అర్థమైపోయిందట.
అటు ప్రభాస్‌తో పాటు ఆయన ఫ్రెండ్స్ మాత్రం సినిమా సూపర్ అని సంబరాలు చేసుకుంటున్నారట. అయితే రాజు మాత్రం ప్రభాస్ దగ్గరకు వెళ్లి సారి నీకు హిట్ సినిమా ఇవ్వలేకపోయానని చెప్పేశారట. ప్రభాస్‌తో పాటు వాళ్ల ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోయారట. సినిమా బాగోలేదని రాజు వాదించినా వాళ్లు ఒప్పుకోలేదట. చివరకు మున్నా బిలో యావరేజ్ అయ్యిందని.. అంత మంచి టాక్ రాకున్నా కూడా 9 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుందని రాజు చెప్పారు.