ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి తిరుగులేని మెగాస్టార్‌గా ఎదిగాడు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరు ఖైదీ సినిమాతో తిరుగులేని స్టార్ హీరో అయిపోయాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా ఎలా ఏలేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. సైరా సినిమా తర్వాత మూడేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకున్న చిరు వచ్చే నెలలో ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఆ తర్వాత వరుస పెట్టి భోళాశంకర్ – వాల్తేరు వీరయ్య – గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. చిరు తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించాడు. చిరు కెరీర్‌లో ఎక్కువుగా విజయాలే ఉన్నాయి. చిరు సినిమాలు ప్లాప్ అయినా కూడా ఎవ్వరికి పెద్ద నష్టం వచ్చేది కాదు. అయితే చిరు కెరీర్‌లో మంచి అంచనాలతో తెరకెక్కిన ఓ సినిమా తొలి రోజున ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇంకేముంది సినిమా అయిపోయింది.. వారం రోజుల్లోనే బాక్సాలు అన్నీ వెనక్కు వచ్చేస్తాయని అన్నారు.
కట్ చేస్తే వారం రోజులు దాటాక సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఏకంగా 100 రోజులు ఆడింది. ఆ సినిమా ఏదో కాదు స్టేట్ రౌడి. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత, కళాబంధు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి నిర్మించారు. చిరంజీవి సరసన భానుప్రియ, రాధా హీరోయిన్లుగా నటించారు. 1989 మార్చి 23న భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది.
ఫస్ట్ సినిమాలో ఏం లేదు.. ప్లాపు అన్న వాళ్లకు రెండో వారం నుంచి దిమ్మతిరిగిపోయింది. మెల్లగా హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో బాలీవుడ్‌లో అమితాబచ్చన్ సూపర్ స్టార్‌గా ఉన్నారు. అక్కడ ఆయన సినిమా వసూళ్లను మించి మరీ స్టేట్ రౌడీ ఇక్కడ వసూళ్లు రాబట్టింది. ఆ రోజుల్లోనే నైజాంలో ఏకంగా కోటి రూపాయల షేర్ వచ్చింది.
ఆ టైంలో ట్రేట్ గైడ్ అనే సినీ మ్యాగజైన్ స్టేట్ రౌడీ కలెక్షన్ల వివరాలు ప్రముఖంగా ప్రచురించింది. ఈ క్రమంలోనే వేర్ ఈజ్ అమితాబ్ అనే టైటి్తో ఈ కలెక్షన్లను అమితాబ్ సినిమాల కలెక్షన్లతో కంపేరిజన్ చేస్తూ ఓ ఆర్టికల్ రాసుకు వచ్చింది. ఈ ఆర్టికల్ చదివిన హిందీ ప్రముఖులు వేర్ ఈజ్ అమితాబ్ టైటిల్ చూసి నోరెళ్లబెట్టారు.