Moviesఇండ‌స్ట్రీలో మ‌ర‌ద‌ళ్ల‌నే పెళ్లాడిన స్టార్ హీరోలు వీళ్లే..!

ఇండ‌స్ట్రీలో మ‌ర‌ద‌ళ్ల‌నే పెళ్లాడిన స్టార్ హీరోలు వీళ్లే..!

సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు, హీరోయిన్లు ఇటీవ‌ల కాలంలో ఎక్కువుగా ప్రేమ వివాహాలే చేసుకుంటున్నారు. ఇప్పుడు జ‌న‌రేష‌న్ అంతా మారిపోయింది. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకునే వారే క‌న‌ప‌డ‌డం లేదు. ఎవ‌రికి వారు ప్రేమ వివాహాలే చేసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో ఒక్క ఎన్టీఆర్ లాంటి వాళ్లు త‌ప్పా అంద‌రూ కూడా ప్రేమ వివాహాలే చేసుకున్నారు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ల‌లో రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, శ్రీను వైట్ల, పూరి జ‌గ‌న్నాథ్‌, అనిల్ రావిపూడి ఇలా ఎంతో మంది ప్రేమ వివాహాలే చేసుకున్నారు.

అయితే వినాయ‌క్‌, సందీప్‌రెడ్డి వంగా లాంటి ఒక‌రిద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్లు మాత్ర‌మే ఎరేంజ్‌డ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక ఇప్ప‌టి హీరోలు, ద‌ర్శ‌కుల సంగ‌తి అలా ఉంటే పాత‌త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో ఎక్కువ మంది పెద్ద‌లు కుదిర్చిన పెళ్లిళ్లు మాత్ర‌మే చేసుకునేవారు. కొంద‌రు స్టార్ హీరోలు అయితే ఏకంగా సొంత మ‌ర‌ద‌ళ్ల‌నే పెళ్లి చేసుకున్నారు. అలా సొంత మ‌ర‌ద‌ళ్లనే పెళ్లి చేసుకున్న హీరోలు ఎవ‌రో చూద్దాం.

ఎన్టీఆర్ – బ‌స‌వ‌తార‌కం :
తెలుగులో న‌ట‌సౌర్వ‌భౌమ ఎన్టీఆర్ త‌న మేన‌మామ కుమార్తెనే చిన్న వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్నారు. సొంత మేనమామ కుమార్తె అయిన బసవ తారకం అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం అట‌. అలాగే బ‌స‌వ‌తార‌కం కూడా చిన్న‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్‌నే ఇష్ట‌ప‌డ‌డంతో ఆమె కూడా ప‌ట్టుబ‌ట్టి త‌న‌కు బావే కావాల‌ని అడిగి మ‌రీ ఎన్టీఆర్‌నే పెళ్లాడింద‌ని అంటారు. అయితే ఆమె క్యాన్స‌ర్‌తో మృతి చెందింది. కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఎన్టీఆర్ ల‌క్ష్మీపార్వ‌తిని పెళ్లాడారు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ – ఇందిరాదేవి :
టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ కృష్ణ కూడా తన మరదలు అయిన ఇందిరా దేవిని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు విజయనిర్మల ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న ఇద్ద‌రు భార్య‌ల‌తోనూ క‌లిసి కాపురం చేశారు. ఎక్కువుగా విజ‌య‌నిర్మ‌ల ద‌గ్గ‌రే ఉన్నా కూడా అటు ఇందిర‌ను కూడా త‌క్కువ చేసింది లేదు.

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు – నిర్మ‌లాదేవి :
ఇక టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మోహన్ బాబు కూడా తన మరదలు నిర్మలా దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. మోహ‌న్‌బాబు ముందు భార్య విద్యాదేవి ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోయారు. అయితే అప్ప‌టికే మంచు విష్ణు, లక్ష్మీప్ర‌స‌న్న పుట్టేశారు. వారికోస‌మే విద్యాదేవి చెల్లి.. త‌న మ‌ర‌ద‌లు అయిన నిర్మ‌లాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. నిర్మాల‌దేవికి మ‌నోజ్ పుట్టాడు.

ఆది సాయికుమార్‌:
డైలాగ్ కింగ్ సాయికుమార్ సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ కూడా తన సొంత మరదలిని పెళ్లి చేసుకున్నాడు. సాయికుమార్ భార్య సోద‌రుడి కుమార్తే ఆదికి భార్య అయ్యింద‌. అయితే చిన్న‌ప్పుడే త‌న కొడుకుకి త‌న త‌మ్ముడు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాల‌ని సాయికుమార్ భార్య అనుకునేద‌ట‌. పెద్ద‌య్యాక ఆది హీరో అయినా కూడా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ అలాగే పెళ్లి చేశారు అట సాయికుమార్ భార్య‌.

కోలీవుడ్ హీరో కార్తీ :
కోలీవుడ్‌లో క్రేజీ స్టార్ బ్ర‌ద‌ర్స్ సూర్య‌, కార్తీ. అన్న సూర్య త‌న‌తో న‌టించిన హీరోయిన్ జ్యోతిక‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక త‌మ్ముడు కార్తీ మ‌ర‌ద‌లు ర‌జ‌నీని పెళ్లి చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news