కొందరు హీరోయిన్లకు వయస్సుతో పనిలేదు.. ఐదారు పదుల వయస్సుకు వచ్చినా చాలా స్వేచ్ఛగా అందాలు ఆరబోస్తూనే ఉంటారు. ఉదాహరణకు మాజీ మోడల్ పద్మాలక్ష్మి ఆరు పదుల వయస్సుకు వచ్చినా కూడా బీచ్‌ల్లో బికినీలతో రచ్చ లేపుతూ ఉండేది. ఇక బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, హాట్ ఐటెం గాళ్ మలైకా అరోరా అయితే నాలుగున్నర పదులు దాటేసినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా ఎంత రచ్చ చేస్తుందో తెలిసిందే. పైగా తనకన్నా వయస్సులో 10 ఏళ్లకు పైగా చిన్నోడు అయిన ప్రియుడు అర్జున్ కపూర్‌ను వెంటేసుకుని.. బీచ్‌లో బికినీలు వేసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని మామూలుగా ఎంజాయ్ చేయదు.
ఇక సోషల్ మీడియాలో ఆమె బికినీ స్టిల్స్ చూస్తుంటే ఈ తరం జనరేషన్ కుర్రకారుకు కూడా మాంచి కిక్ ఉంటుంది. ఇక ఫేడవుట్ అయిపోయిన ఇలియానా కూడా బొద్దు భారిపోయిన తన బాడీని బికినీ షేపుల్లో చూపిస్తూ తాను కూడా లైమ్టైమ్లోనే ఉన్నానని అనిపించుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మరో ముదురు ముద్దుగుమ్మ కూడా ఏకంగా ఐదున్నర పదుల వయస్సులో చేస్తోన్న రచ్చ అయితే మామూలుగా లేదు.
ఆమె ఎవరో కాదు దీప్తీ భట్నాగర్. ఆమె వయస్సుకు ఆమె అందానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఇంతకు దీప్తి ఎవరో కాదు శ్రీకాంత్ కెరీర్లోనే మరపురాని సినిమా అయిన పెళ్లిసందడి హీరోయిన్. ఆమె వయస్సు 54 ఏళ్లు. ఈ వయస్సులో ఆమె గ్లామర్‌కు, అందాలు ఆరబోతకు ఏ మాత్రం మొహమాటం లేదన్నట్టుగా ఉంది. అసలు ఆమె బాడీలోని ఒంపుసొంపులు చూస్తుంటే ఆమె మూడు పదుల వయస్సులో ఉందా ? ఏంటని ఆశ్చర్యపోతుంది.
సహజంగానే ఈ వయస్సు అంటే 54 ఏళ్లు వచ్చాయంటే శరీరంలో గ్లామర్ తగ్గుతుంది. హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వాళ్లు కూడా విపరీతమైన మేకప్పులు వేసుకుని ఏదోలా తమ గ్లామర్‌ను కాపాడుకునేందుకు.. కృత్రిమమైన గ్లామర్ కోసం పాకులాడుతూ ఉంటారు. అయితే దీప్తి నీటి కొలనులోకి దిగిన ఫొటోల్లో కూడా చాలా అందంగా కనిపిస్తోంది. మేకప్పులు, ఇతరత్రా అలంకరణలు లేకుండానే ఆమె ఈ వయస్సులో ఇంత అందంతో ఉంది.
ఈ ఫొటో చూస్తుంటే దీప్తి వయస్సు పెరుగుతున్నా ఆమె వన్నె ఏ మాత్రం తగ్గలేదని క్లారిటీగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా టూరిజం ప్రమోటర్‌గా వ్యవహరిస్తోన్న ఆమె ఫిన్లాండ్లో విహారిస్తోంది. ఇక ఫిన్లాండ్ అద్భుతంగా ఉంటుందని.. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్రాంతం అని కూడా ఆమె చెపుతోంది.