MoviesRRR ఫ‌స్ట్ డే వ‌సూళ్లు భీక‌ర భీభ‌త్సం.. వామ్మో ఈ ఊచ‌కోత...

RRR ఫ‌స్ట్ డే వ‌సూళ్లు భీక‌ర భీభ‌త్సం.. వామ్మో ఈ ఊచ‌కోత ఏందిరా సామీ..!

దాదాపు ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమా వ‌చ్చింది. నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి దిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ విజువ‌ల్ వండ‌ర్ తొలి రోజు అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. ఇక ముందు నుంచే ఈ సినిమాకు దిమ్మ‌తిరిగి పోయే వ‌సూళ్లు వ‌స్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు.

ఇక ఫస్ట్ డే ఫిగ‌ర్స్ అధికారికంగా బ‌య‌ట‌కు రాక‌పోయినా ఎస్టిమేష‌న్స్ అయితే బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ట్రేడ్ వ‌ర్గాల లెక్క‌ల ప్ర‌కారం త్రిబుల్ ఆర్ ఫ‌స్ట్ డే రు. 200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక ముందు నుంచి హిందీ బెల్ట్‌లో సినిమాకు అనుకున్నంత బ‌జ్ రాలేద‌ని అన్నారు. అయితే ఈ సినిమా అక్క‌డ తొలి రోజు రు. 18 – 20 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఊచ‌కోత కోసేసింది అని తెలుస్తోంది. చాలా సింపుల్‌గా.. ఈజీగానే రు. 100 కోట్ల వ‌సూళ్లు సాధించిన‌ట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ అంత‌టా దాదాపు అన్ని థియేట‌ర్ల‌లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేశారు. అద‌న‌పు షోలు, అర్ధ‌రాత్రి షోలు. ప్రీమియ‌ర్ షోలు.. పెంచిన టిక్కెట్ రేట్లు ఇవ‌న్నీ క‌లిసి ఈ సినిమాకు తొలి రోజు దిమ్మ‌తిరిగిపోయే వ‌సూళ్లు రావ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి.

ఇక త‌మిళ‌నాడుతో పాటు మిగిలిన ద‌క్షిణాది భాష‌లు అన్నింటిలోనూ త్రిబుల్ ఆర్ ఫ‌స్ట్ డే టాప్ లేపే ఫిగ‌ర్స్ రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఓవ‌ర్సీస్‌లో ఫ‌స్ట్ డే షో ప‌డ‌కుండానే 3.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో ఊచ‌కోత కోసిప‌డేసింది. దీంతో ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫ‌స్ట్ డే త్రిబుల్ ఆర్ రు. 200 కోట్ల ఫిగ‌ర్ న‌మోదు చేసింద‌ని ప్ర‌స్తుతానికి ఎస్టిమేష‌న్స్ వ‌స్తున్నాయి. అయితే పూర్తి లెక్క‌ల‌తో త్వ‌ర‌లోనే మ‌రో ఆర్టిక‌ల్‌తో మీ ముందు ఉంటాం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news