ప్రభాస్ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బాహుబలి సినిమాకు ముందున్న ప్రభాస్ వేరే.. బాహుబలి తర్వాత ప్రభాస్ వేరు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలు.. ప్రభాస్ సినిమాల బడ్జెట్.. అతడి రెమ్యునరేషన్ దెబ్బకు బాలీవుడ్ ఖాన్‌లు సైతం విలవిల్లాడుతున్నారు. ప్రభాస్ రెమ్యునరేషన్ ఇప్పుడు రు.100 కోట్లకు చేరుకుంది. లైన్లో ఉన్నవి అన్నీ పాన్ ఇండియా సినిమాలే.
ప్రభాస్ తాజాగా నటించిన రాధేశ్యామ్ సినిమా సైతం రు. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మిక్స్ డ్ టాక్ ఉన్నా సినిమా వసూళ్లు బాగున్నాయంటే ప్రభాస్ రేంజ్ బాహుబలి తర్వాత ఎంతలా పెరిగిందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఆదిపురుష్ – సలార్ 1, సలార్ 2, ప్రాజెక్ట్ కే, మారుతి సినిమా ఇవన్నీ లైన్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ తన కెరీర్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 బ్లాక్‌బస్టర్ సినిమాలు వదిలేసుకున్నాడు.
ఈ సినిమాలు కూడా చేసి ఉంటే ప్రభాస్ ఇంకెవ్వరికి అందనంత ఎత్తులో ఉండేవాడు. ప్రభాస్‌కు ఈ క్రేజ్ రావడానికి బాహుబలి వరకు వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండేదే కాదు. ప్రభాస్ వదులుకున్న ఆ బ్లాక్‌బస్టర్ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.
1- ఒక్కడు :
మహేష్ బాబు – భూమిక చావ్లా జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మహేష్‌బాబు కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేయడంతో పాటు మహేష్‌కు సూపర్‌స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఘనత ఈ సినిమాదే. ఈ స్టోరీని దర్శకుడు గుణశేఖర్ ముందుగా ప్రభాస్‌కే చెప్పాడట. అయితే ఈ కాన్సెఫ్ట్ కొత్తగా ఉండడంతో పాటు రిస్క్ అని భావించిన ప్రభాస్ ఈ సినిమాను వదిలేసుకున్నాడు.
2- దిల్ :
దిల్ రాజు నిర్మాతగా నితిన్ ప్రధాన పాత్రలో వివి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దిల్. ఈ మాసీవ్ ఎంటర్టైనర్ నితిన్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇది వాస్తవంగా ప్రభాస్ చేయాల్సిన సినిమా. అప్పుడు ప్రభాస్ రాఘవేంద్ర సినిమాతో బిజీగా ఉండడంతో ఈ సినిమా వదిలేసుకున్నాడు.
3- సింహాద్రి :
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి బ్లాక్ బస్టర్ హిట్. అయితే ఇంత మాస్ క్యారెక్టర్‌కు తాను పనికిరానని ప్రభాస్ వదులుకున్నాడు. ఆ తర్వాత తప్పు చేశానని భావించి రాజమౌళితో వెంటనే ఛత్రపతి చేశాడు.
4- ఆర్య :
సుకుమార్ ఫస్ట్ సినిమా ఆర్య. తొలిసారి అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ కాన్సెఫ్ట్ కూడా కొత్తగానే ఉంటుంది. అయితే ఇది నచ్చక ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో బన్నీ చేసి సూపర్ హిట్ కొట్టాడు.
5- బృందావనం :
జూనియర్ ఎన్టీఆర్.. సమంత.. కాజల్ కలిసి నటించిన బృందావనం ఎన్టీఆర్‌కు వరుస ప్లాపుల తర్వాత మాంచి ఊపు ఇచ్చిన సినిమా. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కథ ముందు ప్రభాస్ వద్దకే వెళ్లింది. అదే టైంలో ప్రభాస్ డార్లింగ్ – మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమాలతో బిజీగా ఉండి వదిలేసుకున్నాడు.
6- నాయక్ :
నాయక్ స్టోరీని దర్శకుడు వివి వినాయక్ ముందుగా ప్రభాస్‌కే చెప్పాడు. అయితే అదే టైంలో ప్రభాస్ కొరటాల శివతో మిర్చి సినిమా డిస్కర్షన్లలో ఉన్నాడు. దీనికి తోడు అంతకు ముందు ప్రభాస్ వినాయక్‌కు యోగి సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ వినాయక్‌తో చేసేందుకు ఆసక్తి చూపకపోవడం కూడా ఈ సినిమా వదులుకోవడానికి మరో కారణం.
7- కిక్ :
మాస్ మాహారాజా రవితేజ నటించిన కిక్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా స్టోరీ రైటర్ వక్కంతం వంశీ కాగా.. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ కథ ప్రభాస్‌కు చెప్పగా కథ నచ్చక ఒప్పుకోలేదు.
8- డాన్ శీను:
గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా కథ కూడా ముందు ప్రభాస్ దగ్గరకు వెళ్లింది. ప్రభాస్‌కు కథ నచ్చక రిజెక్ట్ చేయడంతో చివరకు రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టాడు.9- జిల్ :
ఈ మూవీ ముందుగా ప్రభాస్ వరకు వచ్చింది. అయితే అప్పుడు బాహుబలి సినిమా బిజీలో ఉండడంతో తాను ఈ సినిమా చేయలేక.. వదులుకోలేక తన స్నేహితుడు గోపీచంద్ పేరు సూచించాడు. చివరకు తమ యూవీ బ్యానర్లోనే ఈ సినిమా చేయగా.. మంచి కాన్సెఫ్ట్‌తో తెరకెక్కి సినిమా ఓకే అనిపించుకుంది.
10- ఊసరవెల్లి :
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ముందు ప్రభాస్‌కు చెప్పగా.. కాన్సెఫ్ట్ నచ్చక రిజెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేదు.