ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు అయిన మిల్కీ బ్యూటీ తమన్నా జోరు ఏ మాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవాలి. ఎఫ్ 2 సినిమాకు ముందు తమన్నాకు ఛాన్సులు లేవు. ఆ సినిమా కోసం ఏ ముహూర్తాన అనిల్ రావిపూడి ఆమెను వెంకీ పక్కన సెలక్ట్ చేసుకున్నాడో కాని.. ఆ సినిమా హిట్ అయ్యాక తమన్నాకు మంచి అవకాశాలే వచ్చాయి. బాలీవుడ్‌లోనూ ఆమెకు ఒకటీ అరా ఛాన్సులు వచ్చాయి.
అయితే ఇప్పుడు సీనియర్ హీరోలకు తెలుగులో హీరోయిన్లు దొరకడం లేదు. బాలయ్య, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్‌కు సరైన జోడీ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన సీనియర్ హీరోల్లాగా వీరు చిన్నా చితకా హీరోయిన్లతో జోడీ కట్టలేరు. అలాగని సీనియర్ హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు రావాలంటే వీరి పక్కన నటించేందుకు రావడం లేదు. అయితే ఫేడవుట్ అయిపోయి.. ఇంకా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోన్న తమన్నా, అనుష్క, అంజలి, శృతీహాసన్ లాంటి వాళ్లే ఇప్పుడు వీళ్లకు దిక్కవుతున్నారు.
ఇక ఎఫ్ 2 హిట్ అయ్యాక.. అదే తమన్నాను వెంకీకి జోడీగా ఎఫ్ 3లోనూ అనిల్ రావిపూడి కంటిన్యూ చేశాడు. ఎఫ్ 2 కంటే కాస్త ఎక్కువే డిమాండ్ చేసింది. ఎఫ్ 2కు తమన్నా రెమ్యునరేషన్ రు. 50 లక్షలకు కాస్త అటూ ఇటూగా మాత్రమే. అయితే ఇప్పుడు చిరు భోళా శంకర్‌లో ఆమె హీరోయిన్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా చెల్లిలి సెంటిమెంట్‌తో తెరకెక్కుతోంది. చిరుకు జోడీగా తమన్నా నటిస్తుండగా.. చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.
అసలే చిరు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోయిన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఇదే అదను అనుకుని తమన్నా ఏకంగా ఈ సినిమాకు రు. 3 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే అందులో సగం మొత్తం ఇప్పటికే అడ్వాన్స్‌గా కూడా తీసుకుందని అంటున్నారు. తమన్నా వయస్సు మూడున్నర పదులకు చేరువ అయ్యింది. కుర్ర హీరోలు ఎలాగూ ఆమెకు ఛాన్స్ ఇవ్వరు.
అందుకే ఇప్పుడు ఆమె ఇలా ముదురు హీరోలకు ఆప్షన్‌గా మారి.. వాళ్ల డిమాండ్‌ను బట్టి క్యాష్ చేసుకుంటోందని క్లారిటీ వచ్చేసింది. ఇక నాగార్జున పక్కన కూడా ఓ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాగార్జున మార్కెట్ అంతంత మాత్రమే. మరి ఆమె గొంతెమ్మ కోర్కెలు ఆ నిర్మాతలు తీరుస్తారో ? లేదో ? చూడాలి.