Moviesఆ లేడీ డైరెక్ట‌ర్‌... తెలుగు స్టార్ హీరోయిన్ స‌హ‌జీవ‌నం..!

ఆ లేడీ డైరెక్ట‌ర్‌… తెలుగు స్టార్ హీరోయిన్ స‌హ‌జీవ‌నం..!

సినిమా రంగంలో స‌హ‌జీవ‌నాలు కామ‌న్‌. ఎంతోమంది పెళ్లి చేసుకోకుండా క‌లిసే ఉంటారు. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు… స్టార్ డైరెక్ట‌ర్లు, హీరోయిన్లు స‌హ‌జీవ‌నాలు చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రు హీరోయిన్లు కూడా స‌హ‌జీవ‌నాలు చేసే ప‌రిస్థితి ఉంటుంది. హీరోయిన్లు స‌హ‌జీవ‌నాలు ఏంటంటే… వారు లెస్బియ‌న్స్‌గా ఉంటారు. కొంద‌రు హీరోయిన్లు మ‌గ‌వాళ్ల‌తో మ‌రి ఎందుకు అంత కంఫ‌ర్ట్ ఫీల‌వ్వ‌ని స్థితిలో ఉంటే వారు మ‌హిళ‌ల‌తోనే సాన్నిహిత్యం, ఎఫైర్ కోరుకుంటారు. గ‌తంలో తెలుగు సినిమా రంగంలో ఉన్న మ‌హిళా ద‌ర్శ‌కులు కొంద‌రు హీరోయిన్ల‌తో సహ‌జీవ‌నాలు చేశార‌న్న టాక్ అయితే ఉంది.

అదంతా గ‌తం గ‌తః.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒక‌రు ఓ లేడీ డైరెక్ట‌ర్‌తో స‌హ‌జీవ‌నం చేస్తుంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుప్పుమంటోంది. ఆ హీరోయిన్ ఓ గొప్పింటి కోడ‌లు అయ్యింది. కొన్నేళ్ల కాపురం త‌ర్వాత భ‌ర్త‌కు దూర‌మైంది. విడాకులు ఇచ్చేసింది. ఆ స్టార్ హీరోయిన్‌కు.. త‌న‌కు వ‌రుస‌గా సినిమాల్లో ఛాన్సులు ఇచ్చిన ఓ స్టార్ డైరెక్ట‌ర్‌తో కూడా ఎఫైర్ ఉంద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపించే ఓపెన్ సీక్రెట్‌.

ఇక ఇప్పుడు విడాకుల త‌ర్వాత కూడా ఆమె వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఓ లేడీ సింగ‌ర్‌తో పాటు.. ఓ లేడీ డైరెక్ట‌ర్‌తో మాంచి ఫ్రెండ్ షిఫ్ ఉంది. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు లేడీ డైరెక్ట‌ర్‌తో స‌హ‌జీవ‌నం చేస్తోంద‌ట‌. హైద‌రాబాద్‌లో ఇప్పుడు వారిద్ద‌రు ఎక్కువుగా క‌నిపిస్తున్నార‌ని… రాత్రి అయితే చాలు ఒక్క చోటే చేరిపోతున్నార‌ని.. వారి మ‌ధ్య ఆ సాన్నిహిత్యం కూడా ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఒక్క‌టే ప్ర‌చారం జ‌రుగుతోంది.

స‌ద‌రు స్టార్ హీరోయిన్ కూడా త‌న లైఫ్‌లో ఆ మ‌హిళా ద‌ర్శ‌కురాలిది చాలా ముఖ్య‌మైన రోల్ అని.. ఆమె త‌న జీవితాన్ని ఎంతో ఉత్సాహంతో ఉంచేలా చేస్తుంద‌ని.. త‌న సినిమాలు, తాను ఎంచుకునే క‌థ‌లు.. త‌న లైఫ్ వీట‌న్నింటిలోనూ ఆమె కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ప‌దే ప‌దే ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. ఇక స‌ద‌రు స్టార్ హీరోయిన్ ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు, ప‌ర్స‌న‌ల్ లైఫ్ డిస్ట‌ర్బ్ అయిన‌ప్పుడు త‌న‌కు ఎంతో ధైర్యం చెప్పింద‌ని ఆ ద‌ర్శ‌కురాలిని మెచ్చేసుకుంటోంది.

వాస్త‌వంగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపించే టాక్ ఏంటంటే స‌ద‌రు హీరోయిన్ ఆమె ఎంత‌గానో ప్రేమించిన భ‌ర్త‌కు దూరం కావ‌డంతో లేనిపోని మాట‌లు చెప్పి.. వారి మ‌ధ్య గ్యాప్ పెంచ‌డంలో ఓ పాపుల‌ర్ సింగ‌ర్తో పాటు ఆ మ‌హిళా ద‌ర్శ‌కురాలు కూడా ఉన్నార‌ని అంటారు. ఇక భ‌ర్త‌కు దూర‌మ‌య్యాక ఎంచ‌క్కా ఆ మ‌హిళా ద‌ర్శ‌కురాలినే అన్ని విధాలా వాడేసుకుంటోంది ఆ హీరోయిన్‌.. అందుకే మ‌రీ బోల్డ్‌గా తెగించేస్తోంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news