Moviesనాగార్జున‌తో ఎఫైర్‌పై ఇన్నాళ్ల‌కు నోరు విప్పిన ట‌బు.. అంత ఘాటు ప్రేమా...!

నాగార్జున‌తో ఎఫైర్‌పై ఇన్నాళ్ల‌కు నోరు విప్పిన ట‌బు.. అంత ఘాటు ప్రేమా…!

బాలీవుడ్ న‌టి ట‌బు ఒక‌ప్పుడు తెలుగు తెర‌పై ఒక వెలుగు వెలిగింది. ట‌బు పేరుకు మాత్ర‌మే బాలీవుడ్ న‌టి అయినా ఆమె పుట్టింది హైద‌రాబాదే.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లోకి వెళ్లిన ఆమె అక్క‌డ చాలా సినిమాలు చేసింది. అదే టైంలో సౌత్‌లో కూడా ప‌లు సినిమాలు చేసింది. ఐదున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో ఉన్న ట‌బు ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఆమె రీ ఎంట్రీలో బ‌న్నీ అల వైకుంఠ‌పురంలో సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది.

ఇక ట‌బు తెలుగులో కూడా కొన్ని హిట్ సినిమాలు చేసింది. నాగార్జున – కృష్ణ‌వంశీ కాంబోలో వ‌చ్చిన నిన్నే పెళ్లాడ‌తా సినిమాలో పండుగా ఆమె చేసిన పాత్ర అప్ప‌ట్లో కుర్ర‌కారు హృద‌యాల్లో గిలిగింత‌లు పెట్టేసింది. త‌ర్వాత అదే నాగార్జున‌తో ఈవీవీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆవిడా మా ఆవిడే సినిమా కూడా చేసింది. ఇక వినీత్‌, అబ్బాస్‌తో చేసిన ప్రేమ‌దేశం అయితే సూప‌ర్ హిట్‌. ఆ సినిమాతోనూ యూత్‌లో ఆమె అంటేనే పిచ్చెక్కిపోయేవారు.

ఆ త‌ర్వాత ఆమె తెలుగులో చేసిన సినిమాలు స‌క్సెస్ కాలేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్లోకి వెళ్లి కొన్ని సినిమాలు చేసింది. మ‌నోజ్ బాజ్‌పేయ్‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. మ‌నోజ్‌తో ఆమెకు ఎఫైర్ ఉంద‌ని.. అందుకే వ‌రుస పెట్టి అత‌డితో సినిమాలు చేసింద‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది. అయితే అంత‌కంటే ముందు నుంచి ఆమె నాగార్జున‌తో ఘాటు ఎఫైర్‌లో ఉంద‌నే అంటారు. అస‌లు నాగార్జున కోస‌మే ఆమె పెళ్లి చేసుకోలేద‌నే అంటారు. ఇక ఇప్పుడు ట‌బు హైద‌రాబాద్‌లోనే ఉంటోంది. గ‌త కొన్నాళ్లుగా కూడా ఆమె ఇక్క‌డే ఉంటోంది. ఇందుకు కార‌ణం ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేద‌ని అనేవారు కూడా ఉన్నారు.

తాజాగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో నాగార్జున గురించి స్పందించింది. నాగార్జున, తాను మంచి ఫ్రెండ్స్ అని.. అంతే కాని త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఏం లేద‌ని తెలిపింది. ఇక కొన్నేళ్ల క్రిత‌మే తాను హైద‌రాబాద్‌కు షిప్ట్ అయిన మాట నిజ‌మే అని.. అయితే అది నాగార్జున కోసం కాద‌ని.. తాను ఇక్క‌డ ఓ ఇంటిని కొనుక్కున్నాన‌ని.. అందుకోస‌మే ఇక్క‌డ‌కు వ‌చ్చాన‌ని చెప్పింది.

ఇక కొంద‌రు ఫ్రెండ్ షిఫ్ అంటేనే ఏవేవో అర్థాలు తీస్తార‌ని.. కానీ ఫ్రెండ్ షిఫ్ అంటే అర్థం వేరే ఉంటుంద‌ని ట‌బు చెప్పింది. ఒక మ‌గ‌, ఒక ఆడ కాస్త క్లోజ్‌గా ఉంటే చాలు ఏవేవో అర్థాలు తీసేస్తార‌ని.. వారి మ‌ధ్య సంబంధాలు అంట‌గ‌ట్టేస్తార‌ని ట‌బు వాపోయింది. ఇక 1995 – 1996 టైంలో వీరిద్ద‌రు క‌లిసి ఆవిడా మా ఆవిడే, నిన్నే పెళ్లాడ‌తా, సిసింద్రీ సినిమాల్లో క‌నిపించ‌డంతో పాటు ఏ ఫంక్ష‌న్ల‌కు అయినా క‌లిసే వెళ్లేవారు అందుకే ఈ రూమ‌ర్లు బాగా వినిపించేవి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news