సీనియర్ బ్యూటీ, చెన్నై చిన్నది సమంత విడాకుల తర్వాత మరింత రెచ్చిపోతోంది. అస్సలు ఏ మాత్రం వెనక్కు తగ్గను అంటోంది. పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ చూస్తేనే ఆమె ఎంత తెగించేసిందో తెలుస్తోంది. నాగచైతన్యతో పెళ్లయ్యి నాలుగేళ్లు కాపురం చేసిన సమంత మరీ ఇంత బోల్డ్‌గా ఉండడం వాళ్లకు నచ్చలేదు.. విడాకులకు ప్రధాన కారణాల్లో అది కూడా ఒకటి అన్న ప్రచారం జరిగినా కొందరు నమ్మలేదు. సమంతను చైతు, అక్కినేని ఫ్యామిలీయే ఇబ్బంది పెట్టిందని కూడా అనుకున్నారు.
ఓ గౌరవప్రదమైన కుటుంబానికి కోడలిగా ఉన్నా కూడా ఆమె బోల్డ్నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఫ్యామిలీ మ్యాన్ సీరిస్‌లో ఆమె మరింత హాట్‌గా రెచ్చిపోవడం కూడా ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. అక్కడ కాస్త గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఆమె తాడోపేడో అన్నట్టు విడాకులకు వెళ్లిపోయింది. సరే బోల్డ్నెస్ విషయంలో సమంత సంస్కారవంతురాలే అనుకుంటే మరి విడాకుల తర్వాత ఇంతగా ఎందుకు రెచ్చిపోతుందో ఆలోచన చేసుకోవాలి.
చాలా బరి తెగించేసినట్టుగా ఆమె పాత్రలు, స్టిల్స్ ఉంటున్నాయి. కేవలం సినిమాలో, వెబ్ సీరిస్‌లో కాదు.. బయట స్టిల్స్, ఆమె సోషల్ మీడియా స్టిల్స్ కూడా చాలా హాట్‌గానే ఉంటున్నాయి. తాజాగా సమంత ఇంట్లో ఉండే సాషా, హషా మూగజీవాలతో ఆమె కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేసింది. ఈ రెండు జీవాల వీడియోలను సమంత ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సాషా, హషాల అల్లరి గురించి చెప్పిన సమంత.. ఈ రెండిటికి మొదట్లో అస్సలు పడేది కాదని.. తర్వాత అవి ప్రాణ స్నేహితులు అయిపోయాయని.. జీవితంలో సిబ్లింగ్స్ మధ్య గొడవలు వస్తాయని తెలుసు.. వీటికి కూడా ఇప్పుడు మళ్లీ గొడవలు వచ్చాయని చెప్పింది.
ఈ ఫొటోలో సమంత ఎదలు పైకి కనపడేలా ఉన్నట్టుగా ఉంది. ఆమె కావాలనుకుంటే అవి కవర్ చేసుకుంటూ ఆ ఫొటో తీయించుకోవచ్చు. కానీ సమంత ఏ మాత్రం తాను తగ్గేదేలే అన్నట్టుగా తన ఎదలు పైకి కనిపించేలా స్టిల్ ఇచ్చింది. ఇది ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. దీంతో సమంత బోల్డ్ ఇమేజ్ మరోసారి రచ్చగా మారింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఇటీవలే శాకుంతలం పూర్తి చేయగా.. ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ మూవీ యశోదలోకి ఎంటర్ కానుంది.