టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. ఈ రోజుతో ఈ సినిమా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోబోతోంది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రు. 223 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్నెన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. త్రిబుల్ ఆర్ సరికొత్త చరిత్రలతో బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలకు సైతం దిమ్మతిరిగిపోతోంది. రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రు. 1000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది.
అసలే టాలీవుడ్‌లోనే ఇద్దరు తిరుగులేని క్రేజీ యంగ్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా. అటు బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా. ఈ లెక్కన త్రిబుల్ ఆర్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు భాషలు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా స్కై రేంజ్ టచ్ చేశాయి. ఇక ఇద్దరు హీరోల నటన, జక్కన్న టేకింగ్‌తో పాటు కీరవాణి మ్యూజిక్, దానయ్య నిర్మాణ విలువలు ఇవన్నీ సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్లిపోయాయి.
ఇక త్రిబుల్ ఆర్ 6వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఆరో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రు 9.5 కోట్లు కొల్లగొట్టింది. ఏపీ, తెలంగాణలో మాత్రమే ఈ సినిమా ఇప్పటి వరకు రు. 180 కోట్లు రాబట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాను రు. 191 కోట్లకు అమ్మారు. అంటే రెండో వీకెండ్‌కు బ్రేక్ ఈవెన్ దాటేసి.. లాభాల్లోకి వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బాలీవుడ్‌లో రెండో రోజు నుంచి మెల్లగా ఫికప్ అయిన త్రిబుల్ ఆర్ అక్కడ రు. 13 కోట్లు రాబట్టింది.
ఇప్పటి వరకు నార్త్ బెల్ట్‌లోనే రు. 120 కోట్లు రాబట్టింది. సెకండ్ వీకెండ్‌కు రు. 150 కోట్లు సులువుగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. అక్కడ రు. 92 కోట్లకే ఈ సినిమాను అమ్మడంతో లాభాల్లోకి వచ్చేశారు. ఇక ఓవర్సీస్‌లో 10 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేసింది. లాంగ్ రన్‌లో అసలు ఈ సినిమా వసూళ్లు ఎక్కడ ఆగుతాయో తెలియడం లేదు.