భారతదేశ సినీ ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోన్న భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామా త్రిబుల్ ఆర్ థియేటర్లలోకి వచ్చేందుకు మరి కొద్ది గంటల టైం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్లలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ రోజు సెన్సార్ కంప్లీట్ చేసుకున్న త్రిబుల్ ఆర్ CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా 186 నిమిషాల నిడివి గల రన్‌టైమ్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ రోజుల్లో 186 నిమిషాల రన్ టైం అంటే చాలా ఎక్కువ. మామూలుగా ఎంత పెద్ద సినిమాకు అయినా 150 నిమిషాల రన్ టైం దాటితేనే ప్రేక్షకులు కంటెంట్ ఏ మాత్రం తేడా ఉన్నా బోర్ ఫీలవుతారన్న టాక్ ఉండనే ఉంది. రాజమౌళి బాహుబలి 1, 2 సినిమాల రన్ టైం కూడా 170 నిమిషాలకు పైనే ఉంటుంది. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ రన్ టైం ఏకంగా మూడు గంటలు దాటేసి 186 నిమిషాలుగా ఉంది. అంటే మూడు గంటల కన్నా మరో 6 నిమిషాలు ఎక్కువ.
అంటే ఫస్టాఫ్ వరకు చూసుకున్నా ఎలా లేదన్నా 90 నిమిషాలకు పైనే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ 22 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. ఇంత రన్ టైం అంటే సినిమాపై రాజమౌళి ఎంత ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో తెలుస్తోంది. సినిమా ల్యాగ్ అయినట్టు అనిపించినా ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే రాజమౌళి.. రన్ టైం ఎక్కువ అయినా వెనక్కు తగ్గకుండా సినిమాను ట్రిమ్ చేయించినట్టు ఉన్నాడు.
సినిమాలో కంటెంట్ ఉన్నా.. దమ్మున్న సీన్లు ఉన్నా రన్ టైం 186 నిమిషాలు ఉన్నా ప్రేక్షకుడికి చూడడానికి వచ్చిన ఇబ్బంది ఉండదు. ఓ 15 – 20 నిమిషాలు ఎక్కువ అయినా బోర్ కొట్టకుండా.. అదిరిపోయే రేంజ్‌లో.. అద్భుతం అనేలా ఉంటే కళ్లార్పకుండా తెరమీద ఏం జరుగుతుందా ? అన్న టెన్షన్‌తోనే ఉంటాడు. ఏదేమైనా రన్ టైం విషయంలో రాజమౌళి చాలా డేర్ స్టెప్ తీసుకున్నాడనే చెప్పాలి.
ఇక సెన్సార్ టాక్ ప్రకారం త్రిబుల్ మనలను మరో ప్రపంచంలోకి తీసుకువెళుతుందని చెపుతున్నారు. సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలను మించి రాజమౌళి తీర్చిదిద్దాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు అలియా భట్, ఓవీలియో మోరిస్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, సముద్రఖని నటిస్తున్నారు.