MoviesRRR అస‌లు బ‌డ్జెట్ ఎన్ని కోట్లు.. ఫుల్ డీటైల్స్ ఇవే...!

RRR అస‌లు బ‌డ్జెట్ ఎన్ని కోట్లు.. ఫుల్ డీటైల్స్ ఇవే…!

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమాగా త్రిబుల్ ఆర్ తెర‌కెక్కింది. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత టాలీవుడ్‌లోనే ఇద్ద‌రు క్రేజీ హీరోలుగా ఉన్న రామ్‌చ‌ర‌ణ్‌, తార‌క్ క‌లిసి న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ కావ‌డం.. అటు బాహుబ‌లి 2 త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డం.. క‌రోనా త‌ర్వాత వ‌స్తోన్న పెద్ద బ‌డ్జెట్ సినిమా కావ‌డంతో మామూలు అంచ‌నాలు లేవు.

ఇక భారీ బ‌డ్జెట్ సినిమా అంటున్నారే త‌ప్పా.. అస‌లు బ‌డ్జెట్ ఎంత‌న్న‌ది బ‌య‌ట పెట్ట‌డం లేదు. కొంద‌రు రు. 450 కోట్లు అంటే.. మ‌రి కొంద‌రు వ‌డ్డీల‌తో క‌లుపుకుని రు. 500 కోట్లు అని చెప్పారు. పెద్ద సినిమా కావ‌డంతో అస‌లు లెక్క‌లు బ‌య‌ట‌కు రావు. ట్యాక్స్ నుంచి బిజినెస్ ఇలా చాలా స‌మ‌స్య‌లు ఉంటాయి. అందుకే పేరుకు మాత్ర‌మే భారీ బ‌డ్జెట్ అంటారే త‌ప్పా పూర్తి లెక్క‌లు రానివ్వ‌రు.

అయితే ఏపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త నిబంధ‌న ప్ర‌కారం భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు త‌మ సినిమా బ‌డ్జెట్ ఎంత అన్న‌ది ఖ‌చ్చితంగా చెప్పాలి. చెపితేనే ఐదో షోతో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు ఉంటుంది. ఇక తాజాగా ఈ నిబంధ‌న ప్ర‌కారం టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు ప్ర‌భుత్వం త‌మ సినిమా బ‌డ్జెట్ రు. 336 కోట్లు అని ప్ర‌భుత్వానికి లెక్క‌లు స‌మ‌ర్పించింది. ఇందులో ఎన్టీఆర్ – రాజ‌మౌళి – చ‌ర‌ణ్ రెమ్యున‌రేష‌న్లు లేవు. జీఎస్టీ కూడా మిన‌హాయిస్తేనే ఈ రు. 336 కోట్ల బ‌డ్జెట్‌గా తేలింద‌ట‌.

ఇక పెద్ద బ‌డ్జెట్ కావ‌డంతో.. అది కూడా ఏపీ ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు హీరోలు, ద‌ర్శ‌కుల రెమ్యున‌రేష‌న్లు కాకుండా సినిమా బ‌డ్జెట్ రు. 100 కోట్లు దాట‌డంతో ఈ సినిమాకు ప‌ది రోజుల పాటు టిక్కెట్ ధ‌ర‌లు .. ప్ర‌తి టిక్కెట్‌పై రు. 100 పెంచుకునే వెసులు బాటు క‌ల్పించారు. ఈ బ‌డ్జెట్ లెక్క‌లు అన్నీ కూడా జీఎస్టీ అధికారులు చెక్ చేస్తారు. ప‌క్కాగా లెక్క‌లు చెప్ప‌డంతో ఏపీలో ప‌న్ను, ఇత‌ర‌త్రా విష‌యాల్లో గోల్‌మాల్‌కు ఆస్కారం ఉండ‌దు.

ఇక ఏపీలో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలు అన్నీ కూడా టిక్కెట్ రేట్ల పెంపుకోసం ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకోవాల‌ని అనుకుంటే ఖ‌చ్చితంగా ఈ లెక్క‌లు స‌మ‌ర్పించాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఆచార్య లాంటి పెద్ద సినిమాల‌కు సినిమా హీరోలు, ద‌ర్శ‌కుల రెమ్యున‌రేష‌న్లు వ‌దిలేసి రు. 100 కోట్ల ప్రొడ‌క్ష‌న్ కాస్ట్ ఉండ‌దు. అప్పుడు అలాంటి సినిమాల‌కు టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉండ‌క‌పోవ‌చ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news