టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. సినిమాకు అన్ని వైపుల నుంచి.. అన్ని భాషల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. బాహుబలి ది కంక్లూజన్ సినిమాతో పోల్చి చూస్తే త్రిబుల్ కాస్త వీక్‌గా ఉంటుంది. అంత మాత్రానా ఈ సినిమా డిజప్పాయింట్ చేసిందని చెప్పలేం. ఓ విద్యార్థికి ఓ పరీక్షలో క్లాస్‌లో అందరికంటే టాప్‌గా 90 మార్కులు వచ్చాయి. అదే విద్యార్థికి మరో పరీక్షలో 70 మార్కులు వచ్చాయి. రెండోసారి 70 మార్కులు వచ్చినప్పుడు కూడా మిగిలిన విద్యార్థులు ఎవ్వరూ కనీసం ఆ 70 మార్కులకు దరిదాపుల్లో కూడా లేరు. అంతమాత్రానా 90 మార్కుల పరీక్షతో పోల్చి చూసి.. రెండో పరీక్షలో 70 మార్కులే వచ్చాయి కదా.. అది ఫెయిల్ అంటే కుదురుతుందా ? అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాను చూసి ఓర్వలేని నార్త్ జనాలు.. మన తెలుగులో కూడా రాజమౌళి ఎదుగుదలను చూసి తట్టుకోలని కుళ్లు, కుతంత్రం గాళ్లు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.
బాలీవుడ్‌లో వాడెవ్వడో కాని ఆర్. కమల్‌ఖాన్ అనే ఒక వరస్ట్ ఫెలో ఉన్నాడు. బాహుబలి సినిమా నుంచి ప్రతి తెలుగు సినిమా ప్లాన్ అని ఏడుస్తూనే ఉంటాడు. తాజాగా అతడు మరో సారి త్రిబుల్ ఆర్ సినిమాపై తన అక్కసు అంతా చూపించాడు. భారతీయ సినిమా చరిత్రలో ఇదో అతి పెద్ద చెత్త సినిమా.. ఇది పొరపాటు సినిమాగా తాను భావించడం లేదని.. రాజమౌళి పొరపాటు చేయలేదు.. ఈ సినిమాను చెత్తగా తీయడంతో అతడో పెద్ద నేరం చేశాడని ఇంటర్వెల్ టైంలో ట్వీట్ చేశాడు.
నిజానికి ఈ సినిమా మీద పెద్ద కంప్లెంట్ ఏదైనా ఉంది అంటే అది సెకండాఫ్ మీద.. అది కూడా కొన్ని సీన్లలో మాత్రమే. అయితే ఈ కమల్ ఆర్ ఖాన్ అనేవాడు ఇంటర్వెల్‌కే ఈ సినిమాను టార్గెట్ చేస్తూ నెగిటివ్‌గా ట్వీట్లు వేశాడంటూ వీడికి ఎంత కడుపుమంట ఉందో అర్థమవుతోంది. రు. 600 కోట్లతో అతడు ఇలాంటి చెత్త సినిమాను తెరకెక్కించినందుకు గాను రాజమౌళికి 6 నెలల జైలు శిక్ష వేయాలని కూడా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాను అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్‌తో పోలుస్తూ ట్వీట్స్ చేశాడు. ఇది అంతకు మించిన డిజాస్టర్ అంటూ ఉక్రోషం తట్టుకోలని ట్వీట్స్ వేశాడు.
అయితే ఈ కమలం ఖాన్‌కు సౌత్ ఇండియా సినిమా ప్రేక్షకులు.. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు తిడుతూ రిప్లేలు ఇస్తున్నారు. బండ బూతులతో అతడిని ఆడుకుంటున్నారు. ఇక కమలం ఖాన్ అనేవాడి రివ్యూలకు ఎప్పుడో క్రెడిబులిటీ పోయింది. ఇతడిని పట్టించుకునే వాడు లేకపోవడంతో ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్ కోసం ఈ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు.
తెలుగు మీడియా వాళ్లకు కూడా జక్కన్నపై ఇంత అక్కసా..
అయితే తెలుగు మీడియా అంతా త్రిబుల్ ఆర్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తుంటే తెలుగులో కొన్ని పాపులర్ వెబ్‌సైట్లుగా చెప్పుకునే వెబ్‌సైట్లు కూడా త్రిబుల్ ఆర్‌ను దారుణంగా టార్గెట్ చేస్తున్నాయి. గ్రేట్ వెబ్‌సైట్ అని చెప్పుకునే ఓ వెబ్‌సైట్ అయితే త్రిబుల్ ఆర్‌ను రాజమౌళి కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజప్పాయింట్ సినిమా అని చెప్పడంతో పాటు దారుణంగా 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. పైగా ఈ సినిమాను రాజమౌళీయే తీశాడా ? అని కూడా రాశారంటే వాళ్లు జక్కన్నపై ఎంత అక్కసుతో ఉన్నారో తెలుస్తోంది.
మొన్నామధ్య త్రిబుల్ ఆర్ సినిమా ప్లాప్ అయితే రోడ్లమీదకు వచ్చి సంబరాలు చేసుకునే వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారని అన్నారు. ఇప్పుడు ఇలాంటి థర్డ్ గ్రేడ్ నీచమైన వెబ్‌సైట్లు ఓ తెలుగోడు దేశం గర్వించే సినిమా తీసినా కూడా సహించలేక బురద జల్లుతున్నాయి. పోనీ మరి సినిమా వాళ్లు చెప్పినట్టు దరిద్రంగా ఉంటే వాళ్లు రాసిన రాతలను తప్పుపట్టలేం. అసలు తెలుగులో త్రిబుల్ ఆర్ రేంజ్ తీసే దర్శకులు ఎవరు ఉన్నారు ? పోనీ బాలీవుడ్‌లోనూ ఆ స్థాయి దర్శకులు లేరు. అలాంటి మంచి సినిమా వచ్చింది.. కాకపోతే బాహుబలి 2 పోలిస్తే కాస్త అంచనాలు తగ్గాయి. ఆ మాత్రానికే సినిమాయే చెత్త అని 2.5 రేటింగ్‌లు ఇవ్వడం ఆ కుటిల కుహానా వెబ్‌సైట్‌కే చెల్లింది.
మొన్నామధ్య కరోనా టైంలో ఓ కుర్ర స్టార్ హీరోను ఈ వెబ్‌సైట్ ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదని అతడిపై నెగిటివ్ వార్తలు రాసింది. అప్పుడు ఆ కుర్ర హీరో తనపై వచ్చిన ఆర్టికల్‌ను చదువుతూ ఈ సైట్‌ను ఓ ఆటాడుకున్నాడు. పైగా వెబ్‌సైట్ సర్కిల్స్‌లో పెద్ద బ్లాక్ మెయిలర్ వెబ్‌సైట్‌కే ఈ సైట్‌కే చెత్త చరిత్ర ఉంది. యాడ్లు ఇవ్వకపోయినా.. తమకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా ఇలాంటి నీచపు రాతలు రాస్తూ పబ్బం గడుపుకుంటోంది. ఇప్పుడు రాజమౌళిని కూడా అలాగే టార్గెట్ చేసినట్టుగా ఉంది.
టాలీవుడ్‌లో దాదాపు అన్ని సైట్లు 3 అంతకు మించి 4 వరకు రేటింగ్లు ఇచ్చాయి. ఈ ఒక్క సైట్ 2.5 రేటింగ్ ఇచ్చినప్పుడే కుహానా, కుట్రతో పాటు లోపల వీళ్లకు తిన్నది అరక్క అజీర్తి చేసి మంట పుట్టినట్టుగా ఉంది. అందుకే పనికిమాలిన చెత్త రాతలతో మానసిక ఆనందం పొందుతున్నారు. రేపు త్రిబుల్ ఆర్‌కు మంచి వసూళ్లు వచ్చినా.. ఏదో రాజమౌళి లక్ అని మళ్లీ ఏడుస్తూనే ఉంటారు.