టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన సినిమా మూడేళ్లుగా రిలీజ్ కాలేదు. 2019 సంక్రాంతికి రామ్‌చరణ్ వినయవిధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. చివరకు రామ్‌చరణ్ సైతం ఇలాంటి సినిమా చేసినందుకు తనను అభిమానులు క్షమించాలంటూ ఓ లేఖ కూడా రాసి సంచలనం క్రియేట్ చేశాడు.
ఆ తర్వాత రామ్‌చరణ్.. ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు. ఈ సినిమా కోసమే ఏకంగా మూడు సంవత్సరాలు కేటాయించాడు. ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఇక తన తండ్రి చిరుతో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచర్య కూడా వచ్చే నెల 29న థియేటర్లలోకి వస్తోంది. ఈ రెండు సినిమాలను సమాంతరంగా చేసేసిన చరణ్ ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఆయన బ్యానర్లో వస్తోన్న 50వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా శంకర్ మార్క్ సాలిడ్ మెసేజ్ ఓరియంటెడ్‌గా తెరకెక్కుతోంది. సమకాలీన రాజకీయ వ్యవస్థ గురించి కూడా పలు అంశాలను దర్శకుడు టచ్ చేస్తూ.. కమర్షియల్ కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ టైటిల్ చూస్తుంటేనే శంకర్ బ్లాక్‌బస్టర్ కొట్టేసేలా ఉన్నాడు. ఈ సినిమా సబ్జెక్ట్‌కు తగ్గట్టుగా ఈ టైటిల్ పెట్టి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఇదే ఫైనల్ అవుతుందా ? లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ యేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ట్రై చేస్తున్నారు.