రష్మిక మందన్న రెండేళ్ల నుంచి టాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్. ఆమె పట్టిందల్లా బంగారం. అసలు ఆమె తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెట్టాక ఆమె సొంత ఇండస్ట్రీ కన్నడం కంటే కూడా ఇక్కడే ఆమె క్రేజ్ డబుల్, త్రిబుల్ అయిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఆమె డేట్లు బ్లాక్ చేసేందుకు ఆమె వెంటపడడం మొదలు పెట్టారు. దీంతో ఆమె క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయింది. అటు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.
దీంతో ఆమె రేటు కూడా బాగా పెంచేసింది. ఛలో సినిమాకు రష్మికకు రు. 25 లక్షలకు కాస్త అటూ ఇటూగా మాత్రమే రెమ్యునరేషన్ ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు రష్మిక రెమ్యునరేషన్ తొలి సినిమాతో పోలిస్తే 12 రెట్లు పెరిగిపోయింది. అయినా కూడా కొందరికి ఆమె కాల్షీట్లు ఇవ్వట్లేదు. అయితే ఆమె రేటు విషయంలో కొండెక్కి కూర్చొని ఒక్కోసారి మంచి ఛాన్సులు మిస్ చేసుకుంటూ.. కథల పరంగా రాంగ్ జడ్జ్‌మెంట్ తీసుకుంటుందన్న టాక్ ఇండస్ట్రీలో వచ్చేసింది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ ఆమె తాజా సినిమా ఆడవాళ్లూ మీకు జోహార్లు.
అసలే ప్లాపుల్లో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ నటించిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. టీవీలో సీరియల్ టైప్ మాదరిగా ఉందన్న విమర్శలు వచ్చేశాయి. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా అనుకున్న స్థాయిలో లేవు. రష్మికకు వరుసగా ఛలో – గీతగోవిందం – సరిలేరు నీకెవ్వరు – భీష్మ – పుష్ప ఇలా ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు ఉన్నాయి. మధ్యలో డియర్ కామ్రేడ్ లాంటి ప్లాప్స్ వచ్చినా రష్మిక కెరీర్‌పై అదేమంత ప్రభావం చూపలేదు.
ఇలా వరుస హిట్లతో ఉన్నప్పుడు రష్మిక కథ, హీరోలను బట్టి కాకుండా రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తే సినిమాలు ఒప్పేసుకుంటోందట. అందుకే ఆ ఎఫెక్ట్ ఆమెపై ఆడవాళ్లు మీకు జోహార్లు రూపంలో పడింది. ఈ యేడాది రష్మికకు ప్లాప్‌తో స్టార్ట్ అయ్యింది. పుష్పతో 2021లో మంచి ముగింపు వచ్చినా ఈ సినిమాతో శుభారంభం అందుకోలేకపోయింది. ఆమె ఈ సినిమాలో కథాబలం ఉందని.. తనకు మంచి పేరు వస్తుందనే ఒప్పుకున్నానని రిలీజ్‌కు ముందు రష్మిక ఎంతో చెప్పింది.
అయితే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారని. ఆశపడే ఈ సినిమాకు ఒప్పుకుందన్న ప్రచారం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇలా రెండు మూడు ప్లాపులు పడితే రష్మిక కిందకు దిగిరావడానికి పెద్దగా టైం పట్టదనే అంటున్నారు. మరి రష్మిక ఇప్పటకీ అయినా మారుతుందేమో ? చూడాలి.