త్రిబుల్ ఆర్ రన్ టైం 186 నిమిషాలు. ప్రతి నిమిషాన్ని రాజమౌళి ఎలా తెరకెక్కించాడు.. ప్రతి సీన్ ఏ రేంజ్‌లో ఉంటుందో ? అని టెన్షన్‌తో ఉంటున్నారు. ఇంత రన్ టైం అంటే సినిమా ఏ స్థాయిలో ఉంటే ప్రేక్షకులు చూస్తారో ? అన్న చర్చ మొదలైంది. ఇక ఇద్దరు టాలీవుడ్లో తిరుగులేని క్రేజీ యంగ్‌స్టర్స్ కావడంతో ఇద్దరి పాత్రలు ఎలా ? ఉండబోతున్నాయి. ఎవరి పాత్రకు ఎక్కువ ప్రయార్టీ ఉంటుంది.. ఇలా రకరకాల చర్చలు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.
మూడున్నర సంవత్సరాలుగా షూటింగ్‌లో ఉన్న ఈ సినిమా బడ్జెట్ రు. 500 కోట్లకు కాస్త అటూ ఇటూగా ఉంది. పైగా బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్‌లో రాజమౌళి మానియా మామూలుగా లేదు. ప్రమోషన్లలో తారక్, రాజమౌళి, చెర్రీ ముగ్గురూ పాల్గొంటున్నారు. ఏ ఇంటర్వ్యూలో చూసినా తారక్ డామినేషనే స్పష్టంగా కనిపిస్తోంది. తారక్ తనదైన ఎనర్జిటిక్ టైమింగ్‌తో ఇంటర్వ్యూలను వన్ మ్యాన్ షో చేసేస్తున్నాడు.
అయితే ఈ టైంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇది అధికారికంగానే..! సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం ఆటలో ఓ కీలక సన్నివేశాన్ని రాజమౌళి తీసేశారట. ఆయనే కావాలని ఈ సీన్‌ను దగ్గరుండి కట్ చేయించారని తెలిసింది. ఇప్పటికే సినిమా రన్ టైం ఎక్కువ కావడంతో రాజమౌళియే దగ్గరుండి మరీ ఈ సీన్‌ను తీయించేశారట. అయితే సినిమాకు హిట్ టాక్ వచ్చాక తిరిగి ఈ సీన్ యాడ్ చేస్తారని అంటున్నారు.
మొత్తం 1.36 సెకన్ల రన్ టైం ఉన్న ఈ సీన్ తర్వాత యాడ్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ సీన్‌లో కొమరం భీం ఎన్టీఆర్ అదిరిపోయే పెర్పామెన్స్ ఇచ్చారని అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ నటించిన ఈ సీన్ రాజమౌళి ముందే తీయించారని తెలియడంతో తారక్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే కనీసం రిలీజ్ అయ్యాక అయినా ఈ సీన్ యాడ్ చేస్తారని ఆశించడం తప్పా ఇప్పుడు చేసేదేం లేదు. ఇక ఈ నెల 24 నుంచే ఈ సినిమా ప్రీమియర్లు దేశవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారు.