పూజా హెగ్డే.. టాలీవుడ్ బుట్ట బొమ్మ. ఒక్కప్పుడు ఈ భామ ని చూస్తే ఐరెన్ లెగ్ అంటూ డైరెక్టర్, నిర్మాతలు పారిపోయేవారు. అప్పుడు ఆమె అంటే అంత భయం. ఎక్కద ఆమె తో సినిమా తీస్తెస్ నెత్తిన గుడ్డ ముక్క వేసుకోవాలో అనే భయంతో ఆమె ను దూరం పెట్టేవారు. దశాబ్దం క్రిందట ఆమె సౌత్‌లో జీవా పక్కన మాస్క్ సినిమా చేసినప్పుడు ఇదేం హీరోయిన్ అని ఎవ్వరూ పట్టించుకోలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆమె అడిగినన్ని కోట్లు ఇచ్చి టాప్ హీరోలు అందరూ ఆమే తమ సినిమాల్లో హీరోయిన్ కావాలని మరీ వెంటపడుతున్నారు. పూజా అయితే ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌ను ఏలేస్తోంది. సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూపోతూ..టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఏలేస్తుంది.
కాగా, పూజా రీసెంట్ గా నటించిన చిత్రం “రాధే శ్యామ్”..ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తాకొట్టిందింది. కధ లేకపోవదం..ప్రభాస్ రేంజ్ సినిమా కాకపోవడం..చిన్న స్టోరీ లైన్ కు కోట్లు ఖర్చు చేయడం..ఇలా అన్ని మైనస్ పాయింట్లతో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ సినిమా లో పూజా అందాలకు మంచి మార్కులే పడ్డాయి. కాగా, రీసెంట్ గా పూజా పాపకు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ ఓ ఆఫర్ ఇస్తే.. రిజెక్ట్ చేయడమే కాకుండా ఆయనని దారుణంగా అవమానించిందట. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
రీసెంట్ గా బాలయ్య తో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను..ప్రజెంట్ రామ్ పోతినేనితో ఓ మాస్ ఎంటర్ టైనర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. మొట్టమొదటిసారిగా రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోయపాటి ఈ సినిమా లో హీరోయిన్ గా పూజా అయితే బాగుంటుందని..ఆమె క్రేజ్ ఈ సినిమా కి ప్లస్ అవుతుందని భావించి ఆఫర్ ఇస్తే..ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. బోయపాటి అంటే మాస్ సినిమాలే తీస్తాడు..పైగా ఆయన సినిమాలో హీరోయిన్స్ కి వాల్యూ ఉండదు..హీరోలనే హైలెట్ చేస్తారని..కామెంట్స్ చేసిందట. దీంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ సినిమాలో మనం మొదటిసారి రామ్ సరికొత్త లుక్ లో చూడబోతున్నాం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.