త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో తారక్, చరణ్ దూసుకు పోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి తెరవెనక జరిగిన ఇంట్రస్టింగ్ స్టోరీలతో పాటు పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం. కీరవాణితో కలిసి ఎన్టీఆర్, చరణ్ ముచ్చట్లు పెట్టుకున్న సందర్భాన్ని వీడియో తీసి రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కూడా చరణ్‌ను తారక్ పూర్తి డామినేట్ చేసి తానే లీడ్ తీసుకున్నాడు.
ఆ మాటకు వస్తే అనిల్ రావిపూడి రాజమౌళి – ఎన్టీఆర్ – చరణ్‌తో చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనూ రాజమౌళి, చరణ్ కంటే ఎన్టీఆర్ పార్టిసిపేషనే ఎక్కువుగా ఉంది. ఇక బిగ్‌బాస్ హౌస్ తరహాలో ఈ ముగ్గురు కలిసి సినిమా ఫస్ట్ డే ఎక్కడ చూడాలి ? ఎలా చూడాలని అని చర్చింకుకున్న ప్రమోషనల్ వీడియోలోనూ ఎన్టీఆర్ దంచేశాడు.
ఇక తాజాగా కీరవాణితో జరిగిన ప్రమోషన్ వీడియోలో ఎన్టీఆర్.. చరణ్‌కు ఉండే మతిమరుపు గురించి చెప్పాడు. తాను కంపోజ్ చేసిన సాంగ్స్‌లో పరమ చెత్త సాంగ్‌గా మీకు ఏదనిపిస్తుందని అడిగితే ఎన్టీఆర్ నాగార్జున ఘరానా మొగుడు సినిమాలోని భీమవరం బుల్లోడు పాటను చెప్పాడు. ఆ సాంగ్ సూపర్ హిట్ కదా ? అని కీరవాణి అంటే ఆ లిరిక్స్ వల్లే ఎందుకో గాని తనకు ఆ పాట అంటే అసహ్యం అని చెప్పాడు.
ఇక కీరవాణి చరణ్‌ను నీకు నచ్చని సాంగ్ ఏదని అడిగితే మీరు రీసెంట్గా కంపోజ్ చేసిన ఓ సాంగ్ నచ్చలేదని చెప్పాడే గాని. ఆ పాట గాని.. ఆ సినిమా పేరు గాని తనకు గుర్తు లేదని చెప్పాడు. అప్పుడు ఎన్టీఆర్ అందుకుని.. చరణ్‌కు ఏ విషయం సరిగా గుర్తుండదని.. తాను ఇప్పుడు తారక్‌గా పరిచయం అయితే ఆ మరుసటి రోజు వచ్చి కారక్ అని చాలా కాన్ఫిడెంట్‌గా పిలుస్తాడని చెప్పాడు.
ఇక త్రిబుల్ ఆర్ షూటింగ్లో మాకు అండర్ వాటర్ ఫైటింగ్ కోసం సుమేర్ అనే వ్యక్తి ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నాడని.. అతడు చాలా పెంటాస్టిక్ అని ఎన్టీఆర్ చెప్పాడు. అయితే తమకు సుమేర్ శిక్షణ ఇస్తున్నప్పుడు చరణ్ ఓ సారి సుమేర్ అని.. మరోసారి సమీర్ అని.. మరో రోజు సుమిత్ అని పిలిచాడని.. దీంతో ఎన్టీఆర్‌కు అసలు అతడి పేరేంటో తెలియక కన్ఫ్యూజ్ అవ్వడంతో పాటు తానే పొరపడుతున్నానా ? అని డైలమాలో పడ్డాడట.
చివరకు అతడిని పిలిచి అసలు నీ పేరేంటని అడిగితే సుమేర్ అని చెప్పాడట. మరి సమీర్‌కు, సుమిత్ అన్నా పలుకుతున్నావేంటని అడిగితే.. చరణ్‌గారు పిలుస్తున్నారు కదండి.. రెస్పాండ్ అవ్వకపోతే బాగోదని చెప్పాడట. అలా చరణ్ మతిమరుపును ఎన్టీఆర్ చెప్పి పిచ్చ కామెడీ చేశాడు.