RRR సినిమా రిలీజ్ అయ్యింది. సరే ఓ 10 మంది కడుపు మంట గాళ్లు.. తిన్నది అరగని గ్యాంగ్ సినిమా బాలోదేంటూ కోడిగుడ్డ మీద ఈకలు పీక్కుంటూ నిద్ర పోకుండా కడుపు ఉబ్బరంతో ఏదో ఒకటి అనుకుంటున్నారు. వాళ్ల ఏడుపులు ఎప్పుడూ ఉండేవే.. సినిమా ఎలాగూ హిట్ అయ్యింది.. సరే బాహుబలి 2 కన్నా కాస్త కాదు.. కొంచెం ఎక్కువే తగ్గింది.. అది అందరం ఒప్పుకోవాల్సిందే. ఇక ఇప్పుడు కొందరు ఆరాటం గాళ్లు ఎన్టీఆర్‌కు ఎలివేషన్లు తక్కువ అయిపోయాయి… రామ్‌చరణ్ క్యారెక్టర్ కంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ సెకండాఫ్‌లో తగ్గించేశారు. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఈ పరంపరలోనే మరో పుకార్లు కూడా సోషల్ మీడియాలో రేపారు. సినిమా సెకండాఫ్ చూసిన ఎన్టీఆర్ బాగా హర్ట్ అయ్యారట. ఏఎంబీ మాల్లో సినిమా చూసి బయటకు వచ్చాక ఆయన అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుంటున్నారు. సెకండాఫ్‌లో చరణ్‌కు ఇచ్చిన ఎలివేషన్లు ఎన్టీఆర్‌కు లేకపోవడంతో ఎన్టీఆర్, ఆయన సన్నిహితులు బాగా ఫీలయ్యారట.
ఎన్టీఆర్ పాత్రకు సరైన మొదలు లేదు.. ప్లాష్ బ్యాక్ లేదు.. సరైన ముగింపు కూడా లేదని.. అదే చరన్ పాత్రకు చిన్నప్పటి నుంచే మాంచి ఎలివేషన్లు ఇచ్చారని.. రాముడి గెటప్‌లో కనిపించడంతోనే చరణ్ బాగా హైలెట్ అయిపోయాడని అంటున్నారు. సరే వీళ్ల పుకార్లు, గాసిప్‌లు ఇలా ఉన్నాయి. అసలు వాస్తవం ఏంటో ఓ సారి చూద్దాం. నిజానికి ఎన్టీఆర్ క్యారెక్టర్ తగ్గించారు.. తగ్గింది అనుకోవాల్సి వస్తే.. తగ్గిస్తేనే ఈ రేంజ్‌లో ఎన్టీఆర్ నట విశ్వరూపంతో అరాచకం చేశాడంటే.. అది పెంచి ఉంటే బాగా ప్రయార్టీ ఇచ్చి ఉంటే ఇంకెంత అరాచకం చూపిస్తాడు ? అనుకోవాలో ?
కొమురం భీముడో సాంగ్‌లో.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు ఇక్కడ ఫొటోల్లో చూసిన స్టిల్స్‌లో ఎన్టీఆర్ నటన, ఎక్స్‌ప్రెషన్స్ అసలు ఈ సీన్లు చూస్తుంటే పునకాలే వచ్చేస్తాయి. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్‌ను తగ్గించారు.. తగ్గించి చూపారు అనుకోవాల్సిన అవసరం లేదు. రాజమౌళి టెన్షన్ రాజమౌళికి ఉంటుంది. ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేయడం రాజమౌళికి కాస్త టెన్షన్.. ఎక్కడ ఎన్టీఆర్‌కు ప్రయార్టీ పెరిగితే డామినేట్ చేస్తాడో ? అన్న ఒత్తిడితోనే ఎన్టీఆర్ పాత్రకు ఎక్కడికక్కడ నట్టులు బిగించుకుంటూ వచ్చినట్టు కనిపిస్తుంది.
ఎన్టీఆర్ తన పాత్రకు నూటికి రెండొందుల శాతం న్యాయం చేశాడా ? లేదా ? అన్నదే చూడాలి. అయితే ఎన్టీఆర్ దీనికి ఫీలయ్యాడు అని కోడిగుడ్డ ఈకలు పీకడం కరెక్ట్ కాదేమో..! అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్తగా నటించింది.. నటనా పరంగా నేర్చుకుంది ఏమీ లేదు. ఇలాంటి నటన ఎప్పుడో చేసేశాడు. ఈ సినిమాతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్‌లో పెద్దగా ఒరిగేదీ ఉండదు.