ప్రపంచ సినిమా రంగాన్ని కాస్టింగ్ కౌచ్ అనే భూతం బాగా వెంటాడుతోంది. ఇలా అనడం కంటే అది ఇటీవల బాగా బయటకు వచ్చి పాపులర్ అవుతోంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు… ఇంకా చెప్పాలంటే ఇక్కడ మన తెలుగు సినిమా రంగంలోనే 1960వ దశకం నుంచే ఉంది. అప్పటి స్టార్ హీరోయిన్లు అందరూ దర్శకులో లేదా అప్పటి స్టార్ హీరోల కింద నలిగిన వారే.. ! అయితే అప్పట్లో దీనిని గుట్టుగా ఉంచేవారు. ఏ హీరోయిన్ కూడా తమకు ఇష్టమైన హీరోనో లేదా దర్శకుడి దగ్గరో పడుకున్నా.. పక్క సుఖం ఇచ్చి ఛాన్సులు తీసుకున్నా అది బయటకు చెప్పేవారే కాదు. ఒక వేళ వాళ్లతో పడుకోవడం ఇష్టం లేకున్నా కూడా ఛాన్సుల కోసం అలా చేసినా బయటకు చెప్పేందుకు భయపడేవారు. అలా చెపితే ఆ హీరోయిన్లకు ఏ స్టార్ డైరెక్టరో లేదా.. స్టార్ హీరోనో ఛాన్సులు ఇచ్చేవారు కాదు.
ఆ హీరోయిన్ కెరీర్ అక్కడితోనే ముగిసి పోయి ఉండేది. అందుకే అవన్నీ చాటు మాటుగా.. గుట్టుగా జరిగిపోయేవి. ఇక ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా యుగం. అప్పుడు ఇవేవీ లేవు. మద్రాస్ లో ఉండే ఒకటి రెండు వార పత్రికలు మాత్రమే ఈ గుసగుసలను చాలా సీక్రెట్‌గా.. అది కూడా పేర్లు లేకుండా ప్రచురించేవి. అయితే ఆ పత్రికలు కూడా సామాన్య జనాలకు అందుబాటులో లేకపోవడంతో ఇవి సామాన్య జనాలకు పెద్దగా తెలిసేవి కావు. ఇప్పుడు ఎవరైనా ఒక్క గాసిప్ వేస్తే.. దానినే పది మంది అటు ఇటూ తిప్పి వేసేస్తున్నారు. జస్ట్ మహా అయితే అందరికి ఆ విషయం తెలియడానికి గంట కూడా పట్టడం లేదు.
ఇక నార్త్ టు సౌత్ గత నాలుగేళ్లుగా కాస్టింగ్ కౌచ్, మీ టు ఉద్యమం బాగా ఊపందుకుంది. సింగర్ చిన్మయి, శ్రీరెడ్డి, రాధికా ఆఫ్టేతో పాటు చాలా మంది తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపులను ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు చాలా మంది తమ లైంగీక వేధింపులపై ఓపెన్ అయిపోతున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి సైతం కాస్టింగ్ కౌచ్‌పై ఓపెన్ అయ్యింది. తాను మోహన్‌బాబు కుమార్తెను అయినా కూడా తాను కూడా లైంగీక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది.
తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్, ట్రోల్స్, కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. తాను మోహన్‌బాబు కూతురినే అయినా, సినిమా ప్రపంచంలోనే పుట్టి పెరిగినా.. తాను ఇండస్ట్రీలో టాప్ కుటుంబానికి చెందిన అమ్మాయిని కావడంతో తనకు ఈ ఇబ్బంది ఉండదని అనుకున్నా… అవి తప్పలేదని చెప్పింది. ఇక కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు.. బ్యాంకింగ్, ఐటీ ఇలా ప్రతి రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ అనేది ఉందని లక్ష్మి బాంబు పేల్చింది.
తన ఫ్రెండ్స్ కూడా వీటి గురించి ఎన్నో విషయాలు చెపుతూ ఉంటారని.. ఇక బాడీ షేమింగ్ ట్రోల్స్ ప్రతి ఒక్కరికి తప్పవని ఆమె వాపోయింది. అయితే వాటిని మనం పట్టించుకోకూడదని… మనకు ఎలా నచ్చితే అలాగే ఉండాలని లక్ష్మి చెప్పింది. ఇక మంచు లక్ష్మి కాస్టింగ్ కౌచ్ భారీన పడిందా ? లేదా ? అన్నది ఆమె చెప్పేవరకు మనకు తెలియదు కాని.. ఆమె వేష, భాషలపై మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది.