Moviesరాధేశ్యామ్ నెగిటివ్ టాక్‌కు ప్ర‌భాస్ కూడా ఓ కార‌ణ‌మేనా...!

రాధేశ్యామ్ నెగిటివ్ టాక్‌కు ప్ర‌భాస్ కూడా ఓ కార‌ణ‌మేనా…!

మ‌న తెలుగు సామెత‌ల్లో ఒక నానుడి ఉంది… అడుసుతొక్కనేలా కాలు కడగనేలా.. అతిగా తినడమేలా లావయ్యామని బాధపడడమేలా ఈ నానుడి ఇప్పుడు యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు క‌రెక్టుగా వ‌ర్తిస్తుంది. ప్ర‌భాస్ అంటే ఒక‌ప్పుడు అంద‌మైన క‌టౌట్‌.. బాహుబ‌లికి ముందు మిర్చి సినిమా హిట్ అయిన‌ప్ప‌టి నుంచి యూత్‌లో ప్ర‌భాస్ క్రేజ్ మామూలుగా పెర‌గ‌లేదు. ఒక‌ప్పుడు తెలుగు యువ‌త‌తో పాటు అమ్మాయిల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు లాంటి వాళ్ల‌కు మాంచి క్రేజ్ ఉండేది. ఈ ముగ్గురు హీరోల సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు యూత్‌తో పాటు అమ్మాయిలు కూడా విప‌రీతంగా చూసేవారు.

మిర్చి సినిమా నుంచి యూత్‌తో పాటు అమ్మాయిల్లోనూ ప్ర‌భాస్ వారి క‌ల‌ల రాకుమారుడు అయ్యాడు. మిర్చి త‌ర్వాత బాహుబ‌లిలో ప్ర‌భాస్ ఫిజ‌క్‌, స్టైల్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రు మెస్మ‌రైజ్ అయిపోయారు. బాహుబలి ది బిగినింగ్ త‌ర్వాత ప్ర‌భాస్‌కు నేష‌న‌ల్ వైడ్‌గా పాపులారిటీ వ‌చ్చింది. ఆ త‌ర్వాత సాహోతో మ‌రింత స్టైలీష్ హీరో అయిపోయాడు. అమ్మాయిలు ప్ర‌భాస్ ప‌డిచ‌చ్చేంత‌గా.. డార్లింగ్ అంటూ మరింత ముద్దుగా పిలుచుకునేంత‌గా ఎదిగిపోయాడు.

అయితే ఈ క్రేజ్ వ‌చ్చింద‌న్న ఆనందంలోనో లేదా క‌రోనాతో ఖాళీగా ఉన్నందునో కాని.. ప్ర‌భాస్ లుక్ స్పాయిల్ అయిపోయింది. ప్ర‌భాస్ మాంచి భోజ‌న ప్రియుడు.. తిండి విష‌యంలో మ‌నోడు రాజీప‌డ‌డు. తాను తిన‌డ‌మే కాదు.. త‌న‌తో పాటు న‌టించే హీరోయిన్లు.. ఇత‌ర క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల‌కు కూడా ఇంటినుంచి 10 – 15 ర‌కాల‌తో ఫుడ్ ఐటెంలు తెప్పించి మ‌రీ పెట్టిస్తాడు. ఇక ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించిన హీరోయిన్లు అంద‌రూ కూడా ప్ర‌భాస్ ఇంటి ఫుడ్ రుచి చూసిన మెచ్చుకున్న‌వాళ్లే..!

రాధేశ్యామ్‌లో న‌టించిన భాగ్య శ్రీ సైతం ప్ర‌భాస్ విందుకు ఫిదా అయిపోయింది. త‌న ప‌క్క‌న న‌టించే వాళ్ల‌కే ఇన్ని ర‌కాల ఐటెంల‌తో ప్ర‌భాస్ ఫుడ్ పెడుతున్నాడు అంటే ఇక ప్ర‌భాస్ ఆ ఆహార ప‌దార్థాల‌ను ఎంత ఇష్టంగా తింటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇది ప్ర‌భాస్ ఫిజిక్‌లో తేడాకు కార‌ణ‌మైంది. క‌రోనా వ‌ల్ల యేడాదిన్న‌ర పాటు స‌రిగా షూటింగ్‌లు లేవు. దీంతో స‌రైన వ‌ర్క‌వుట్లు కూడా ప‌డిన‌ట్టుగా లేవు. దీంతో ఫిజ‌క్ దెబ్బ‌తిన‌డంతో పాటు లుక్ స్పాయిల్ అయిపోయింది.

రాధేశ్యామ్ చూసిన ప్ర‌తి ఒక్క‌రు సినిమాకు నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ కావ‌డం వెన‌క ప్ర‌భాస్ లుక్ కూడా ఓ కార‌ణ‌మైంద‌ని అంటున్నారు. సాహో వ‌ర‌కు సూప‌ర్ లుక్స్‌తో చంపేసిన ప్ర‌భాస్ ఇప్పుడు మ‌రీ గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయాడు. బుగ్గ‌లు బాగా లావైపోయాయి. బుగ్గ‌లు లావ‌య్యాయి.. బాగా చ‌బ్బీగా ఉన్నాడు.. ఫేస్‌లో మునుప‌టి అంత ఛ‌రిష్మా అయితే క‌న‌ప‌డ‌డం లేదు. మ‌రి ప్ర‌భాస్‌లో మునుప‌టి లుక్ ఎప్ప‌ట‌కి వ‌స్తుందో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news