తెలుగు సినిమా చరిత్రలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక మైన స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఆరేడు దశాబ్దాలుగా ఈ ఫ్యామిలీ లెగసీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూనే ఉంది. మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఉన్నారు. ఆ తరంలో సీనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత తరంలో ఆయన తనయుడు బాలయ్య స్టార్ హీరోలుగా కొనసాగారు. ఇక మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్టార్ హీరోగా కంటిన్యూ అవుతోన్న సంగతి తెలిసిందే.
అసలు ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది వచ్చారు. రెండో తరంలో ఆయన తనయులు బాలకృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా వస్తే జయకృష్ణ సినిమాటోగ్రాఫర్‌గాను, డిస్ట్రిబ్యూటర్‌గాను ఉన్నారు. మూడో తరంలో ఎన్టీఆర్ తర్వాత తారకరత్న, కళ్యాణ్‌రామ్ ఇద్దరూ కూడా హీరోలుగా వచ్చారు. వీరిలో ఎన్టీఆర్ మాత్రమే నందమూరి బ్రాండ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే పౌరాణికం – సాంఘీకం – జానపదం – చారిత్రకం ఇలా కథలో అయినా ఇట్టే ఇమిడిపోయి నటించగలం సత్తా నందమూరి ఫ్యామిలీకే సొంతం.
ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు బాలయ్య కూడా తండ్రి లైన్లోనే వెళ్లారు. ఇక ఇప్పుడు ఈ తరం జనరేషన్ హీరోలలో ఎవ్వరూ కూడా ఈ తరహా పాత్రలు పోషించే డేర్ కూడా చేయడం లేదు. కేవలం సాంఘిక కథాంశం ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. అసలు పౌరాణికం, జానపదం, చారిత్రకం అన్న ఊసు ఎత్తినా కూడా హీరోలు భయపడిపోతున్నారు. అయితే ఇందుకు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే మినహాయింపు
ఎన్టీఆర్ చిన్నప్పుడే బాల రామాయణం సినిమాలో శ్రీరాముడిగా నటించి మెప్పించారు. అప్పుడే తాను తాతకు తగ్గ మనవడిని అనిపించుకున్నారు. ఇక ఫ్యాక్షన్ సినిమాలతో పాటు యమదొంగ సినిమాలో యంగ్ యముడిగా కనిపించారు. ఆది, సింహాద్రి సినిమాల్లో చిన్న వయస్సులోనే పవర్ ఫుల్ ఫ్యాక్షన్ సినిమాల్లో కనిపించి ఔరా అనిపించారు. ఇక జైలవకుశలో రావణుడిగా ఇరగదీశాడు. ఏదేమైనా ఆల్‌రౌండర్‌గా ఏ పాత్రలో కనిపించాలన్నా అది నందమూరి వంశ మూడో తరం హీరోగా తనకు తానే సాటి అని ఫ్రూవ్ చేసుకున్నాడు.