కన్నడ కంఠరీవ రాజ్‌కుమార్ తనయుడు అయిన దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొత్తం 4 భాషల్లో 4 వేల థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. పునీత్ మనమధ్య లేకపోయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ సినిమా రిలీజ్ అయిన తీరే చెపుతోంది. కన్నడ నాట ఓ వారం రోజుల పాటు మరే సినిమాలు రిలీజ్ కాకూడదని సినిమా వాళ్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకుని.. పునీత్‌పై తమకు ఉన్న అభిమానం చాటుకున్నారు.
వారం రోజుల పాటు కర్నాకటలో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఈ సినిమానే ప్రదర్శించనున్నారు. కేవలం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌లో దుమ్మురేపే రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేజీఎఫ్ సినిమా వచ్చేవరకు కన్నడ నాట హయ్యస్ట్ షేర్ రాబట్టిన సినిమాలు పునీత్ ఖాతాలోనే ఉండేవి. అయితే వీటిని కేజీఎఫ్ క్రాస్ చేసింది.
ఇక ఇప్పుడు జేమ్స్‌కు కేవలం కర్నాటకలో మాత్రమే ఏకంగా రు. 65 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ మినహా మరే సినిమాకు ఈ రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరగలేదు. ఇక వారం రోజుల పాటు ఈ సినిమా టిక్కెట్లు బుక్ అయిపోయాయి. రాజధాని నగరం బెంగళూరుతో పాటు మైసూర్, రాయచూర్, బీదర్, బీరార్, బెంగళూరు ఇలా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఎక్కడ చూసినా జేమ్స్ మానియాలో కర్నాకట సినిమా లవర్స్ మునిగి తేలుతున్నారు.
ఇక కర్నాటక డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ నెల 17 నుంచి 24 వరకు రాష్ట్రంలో అన్ని థియేటర్లలోనూ ఈ సినిమానే ప్రదర్శించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కేవలం కర్నాటకలో మాత్రమే కాదు తెలుగు, తమిళంలోనూ జేమ్స్ హంగామా ఉంది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను తెలుగులో 250 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక నార్త్ బెల్ట్ హిందీలో 300 థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.