అసలే ఇది దారుణమైన సమాజం. ఈ నాటి సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఇక సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఎవరెవరో మాటలు నమ్మి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకున్న వారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు వెండితెరపై ఓ వెలుగు వెలిగిపోవాలని. తమను తాము మహారాణుల్లా ఊహించుకోవాలని భావించిన అమ్మాయిలు తీరా కట్ చేస్తే ఎవరో వలలో పడి తమను తాము సర్వస్వం అర్పించేసుకుంటారు.
పైగా చిన్నా చితకా జూనియర్ ఆర్టిస్టులో.. లేదా మీడియం రేంజ్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఏకంగా పెద్ద పెద్ద హీరోయిన్లు… స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన వారు సైతం చిన్న మిస్టేక్ చేసి బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్న వారే ఉన్నారు. మహానటి సావిత్రికి ఏం తక్కువ అని అప్పటికే పెళ్లయ్యి పిల్లలు ఉన్న జెమినీ గణేషన్‌ను పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇక దివ్యభారవతి 20 ఏళ్ల నిండకుండానే స్టార్ హీరోయిన్.. దేశాన్ని ఊపేసింది. ఆ వయస్సులో ఆమెకు పెళ్లి అవసరం లేకుండానే పెళ్లి చేసుకుంది.
అతిలోక సుందరి శ్రీదేవిది అంతే..! తాజాగా ఓ వర్థమాన నటి కూడా ఓ మాయగాడి వలలో పడింది. పైగా అతడు నిర్మాత అని చెప్పడంతో ఇంకేముందు అని సర్వస్వం అర్పించేసుకుని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక కాని అతగాడి బండారం ఏంటో బయట పడలేదు. పెళ్లయ్యాక అతడు ఆమె బలవంతంగా వ్యభిచారం చేయాలని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. చెన్నైలో ఉండే సహాయనటి పరమేశ్వరి అలియాస్ భైరవికి భర్త లేకపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నైలో ఉంటోంది.
ఆమె చిన్నా చితకా పాత్రలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు వేలూరుకు చెందిన రాజా దేసింగ్ అలియాస్ సుబ్రమణి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అంతేకాకుండా ఆమెను నిర్మాతను చేస్తానని బలవంతంగా నమ్మించాడు. అతడి మాటమాటలు నమ్మిన ఆమె అతడికి సర్వస్వం అర్పించేసింది. ఆ తర్వాత ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్నాక ఆమెను బలవంతంగా వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు పిల్లలతోనూ అదే పని చేయించాలని కూడా ఒత్తిడి చేస్తున్నాడంటూ ఆమె బోరుమంది. ఇదే విషయమై ఆమె చెన్నై డీజీపీకి ఫిర్యాదు చేసింది. తాను అతడికి దూరంగా వచ్చేసి తన బతుకు తాను బతుకుతున్నా కూడా తాను చెప్పినట్టు చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని భైరవి చెప్పింది. సుబ్రమణి గతంలో ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడని.. బాలికలపై అత్యాచారం చేసినందుకు అతడిపై పోక్సో చట్టం కింద కేసులు కూడా నమోదు అయ్యాయని చెప్పింది.