సినిమా రంగంలో బంధాలు బంధుత్వాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఎవరి వ్యాపారం వారిది. నటించా మా..డబ్బులు వచ్చాయా ? అని చూసుకునే నాయకా, నాయకులే ఇప్పటికీ.. ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే.. దీనికి బిన్నంగా వ్యవహరించిన ఒకరిద్దరు నాయకులు కూడా ఉండడం గమనార్హం. ఆయనే శోభన్‌బాబు. తెలుగు సినీ రంగంలో కృష్ణా జిల్లా నుంచి హీరోలుగా వెలుగొందినవారిలో ఈయన కూడా ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తర్వాత.. ఈ జిల్లా నుంచి పాతతరం నాయకుడిగా.. శోభన్‌బాబు కనిపిస్తారు. తర్వాత.. ఈ రేంజ్‌లో ఎవరూ పేరు తెచ్చుకోలేదు.
మొదట్లో.. అన్నగారు ఎన్టీఆర్ శోభన్‌బాబు.. మద్రాస్ వచ్చిన కొత్తలో తన రూంలోనే విడిది చేసే అవకాశం కల్పిం చారు. అంతేకాదు.. దుక్కిపాటి మధుసూదన్‌రావు ( విక్టరీ మధుసూదన్ రావు) వంటి అగ్ర దర్శకులకు కూడా పరిచయం చేశారు. మా తమ్ముడు.. అంటూ.. అన్నగారు.. అందరికీ శోభన్‌బాబును దగ్గరుండి పరిచయం చేశారు. దీంతో శోభన్‌బాబు అందరికీ పరిచయం అయ్యారు. ఒకానొక దశలో తీరికలేని షెడ్యూల్ వరకు శోభన్‌బాబు వెళ్లిపోయారు. అయితే.. ఆయన ఎప్పుడూ తనను ప్రోత్సహించిన వారిని మరిచిపోలేదు. అందుకే.. అన్నగారు పార్టీ పెట్టినప్పుడు కూడా.. ఆయనకు ప్రచారం చేసి పెట్టారు.
ముఖ్యంగా మైలవరం.. తిరువూరు.. ప్రాంతాల్లో.. టీడీపీ పట్టుపెంచుకునేలా శోభన్‌బాబు వ్యవహరించారని అంటారు. ఈ క్రమంలోనే అన్నగారు.. శోభన్‌బాబును తమ్ముడు అంటే.. ఆయన మాత్రం నాన్నగారు అనిపిలిచేవారట. అంతేకాదు.. బాలయ్య, హరికృష్ణలను కూడా తమ్ముడు తమ్ముడు అంటూ.. శోభన్‌బాబు పిలిచేవారు. అన్నగారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా.. తానే ముందుండి నడిపించేవారు. ఇక, తన ఇంట్లో కార్యక్రమాలకు అన్నగారు దగ్గరుండి ముహూర్తాలు పెట్టేవారట.
ఆ తర్వాత శోభన్‌బాబు రియల్ ఎస్టేట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ టైంలోనే కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. చెన్నైలో తక్కువ రేట్లకే భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. తర్వాత వాటి విలువ అమాంతం పెరిగిపోయింది. అయితే శోభన్‌బాబు తన కుమారులను మాత్రం సినిమా రంగంలోకి తీసుకురాలేదు. వారిద్దరు బిజినెస్‌మేన్లుగా స్థిరపడ్డారు. ఆ తర్వాత శోభన్‌బాబుకు – మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఉన్న రిలేషన్ బాగా పాపులర్ అయ్యింది.
ఏదెలా ఉన్నా తనను ఎంతో అభిమానించిన.. తాను ఎంతో ఆరాధించిన ఎన్టీఆర్‌పై ఒక విషయంలో మాత్రం శోభన్‌బాబు విభేదించారు. అదే అన్నగారు రెండో వివాహం చేసుకోవడం. ఇక, అప్పటి నుంచి అన్నగారికి దూరమయ్యారని అంటారు. ఏదేమైనా.. సినిమా రంగంలో అన్నగారిని నాన్నగారు అని పిలిచిన ఏకైన హీరో శోభన్‌బాబు ఒక్కడే కావడం విశేషం.