నందమూరి నటవారసుడిగా, మూడో తరం హీరోగా ఆ వంశం నుంచి వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. చిన్నప్పుడే బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించిన అఖిలాంధ్ర ప్రేక్షకులను అలా ఆకట్టేసుకున్నాడు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో కెరీర్‌లో తొలి హిట్ కొట్టి అక్కడ నుంచి ఆది – సింహాద్రి లాంటి బ్లాక్‌బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలతోనే ఎన్టీఆర్ తిరుగులేకుండా దూసుకుపోయాడు.
ఇక తాజాగా మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ కొమరం భీంగా అదరగొట్టేశాడన్న ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ఎన్టీఆర్ వరుస పెట్టి క్రేజీ కాంబినేషన్లు సెట్ చేసుకుంటున్నాడు.
ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం కావడానికి ముందు బాల నటుడిగాను నటించాడు. అంతకు ముందో ఓ సీరియల్లోనూ నటించాడు. అయితే ఈ తరం జనరేషన్ హీరోల్లో ఈ విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. డైరెక్టర్ గుణశేఖర్ మనకు తెలుసు.. అనుష్కతో రుద్రమదేవి తీసిన గుణశేఖర్ ఇప్పుడు సమంతతో శాకుంతలం చేస్తున్నాడు.
ఈ గుణశేఖర్ డైరెక్షన్‌లోనే ఎన్టీఆర్ చిన్న వయస్సులోనే బాల రామాయణం సినిమాలో నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చాలా మంది జాతకాలు మారిపోయాయి. ఎన్టీఆర్‌కు చిన్న వయస్సులోనే మాంచి క్రేజ్ వచ్చింది. గుణశేఖర్‌ను ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్‌ను చేసింది. ఇక ఈ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ చిన్నప్పుడు ఓ టీవీ సీరియల్లో కూడా నటించాడు.
ఆ సీరియల్ ఏదో కాదు.. ఈటీవీలో ప్రసారమైన భక్తమార్కండేయ. ఈ సీరియల్లో ఎన్టీఆర్ లీడ్ రోల్లో భక్త మార్కండేయ పాత్రలో నటించాడు. ఈ సీరియల్లో అద్భుతమైన పెర్పామెన్స్‌తో ఎన్టీఆర్ తన నటనకు ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఈ సీరియల్లో ఎన్టీఆర్ నటన చూసే ఫిదా అయిన రామోజీరావు తన బ్యానర్ ఉషాకిరణ్ మూవీస్‌లోనే ఎన్టీఆర్‌ను నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం చేశారు.