Moviesరాజ‌మౌళిని చూసి టాలీవుడ్‌లో విప‌రీతంగా కుళ్లుకుంటోందెవ‌రు..!

రాజ‌మౌళిని చూసి టాలీవుడ్‌లో విప‌రీతంగా కుళ్లుకుంటోందెవ‌రు..!

త్రిబుల్ ఆర్ వ‌చ్చేసింది.. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూశాక చాలా మంది తెలుగు విమ‌ర్శ‌కులు.. రాజ‌మౌళికి ఒక్క‌సారి ప్లాప్ ప‌డితే చూద్దాం అని ఏడ్చే కుళ్లుబోతోళ్లు హ‌మ్మ‌య్యా సినిమా ప్లాప్‌.. రాజ‌మౌళి దొరికిపోయాడు అని సంబ‌రాలు చేసుకోవ‌డం మొద‌లు పెట్టేశారు. వ‌ర్మ కూడా గ‌తంలో ఓ మాట అన్నాడు. త్రిబుల్ ఆర్ ప్లాప్ అయితే రోడ్ల‌మీద‌కు వ‌చ్చి సంబ‌రాలు చేసుకోవ‌డానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అని.. అది అప్పుడు న‌మ్మ‌శ‌క్యం అనిపించ‌లేదు.. కానీ త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యాక రాజ‌మౌళిపై ఏడుస్తోన్న వాళ్ల‌ను చూస్తే ఇది నిజ‌మే అనిపించింది.

 

కొంద‌రు అయితే ప‌ని క‌ట్టుకుని రాజ‌మౌళి బాహుబ‌లి 2 క్రేజ్‌ను వాడుకుని అంద‌రిని మోసం చేసి ఈ సినిమా తీశాడ‌ని విమ‌ర్శించ‌డం మొద‌లు పెట్టేశారు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కులు మాత్ర‌మే ఈ సినిమా బాగుంద‌ని స్పందించారు. మ‌హా మ‌హా స్టార్ డైరెక్ట‌ర్లు నోళ్ల‌కు తాళాలు వేసుకుని అస‌లు ఈ సినిమాతో త‌మ‌కే మాత్రం సంబంధం లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. హీరోల్లోనూ అంద‌రూ స్పందించ‌లేదు.

ఇక రాజమౌళిని చూసి తెలుగు స్టార్ డైరెక్ట‌ర్లు మాత్ర‌మే కాదు..తెలుగు విమర్శకులు విపరీతంగా కుళ్లుకుంటున్నారు. ఏడుస్తున్నారు. బోరుమంటున్నారు. అస‌లు మాకు ఈ క‌థ న‌చ్చ‌లేదు.. ఈ సినిమా న‌చ్చ‌లేదు.. అస‌లు ఈ వ‌సూళ్లు ఎందుకు వ‌స్తున్నాయి.. మాకు న‌చ్చ‌క‌పోతే ఈ వ‌సూళ్లు రాకూడ‌దు అన్నంత‌గా వీళ్లు ఏడ్చేస్తున్నారు. వీళ్ల‌కు న‌చ్చ‌క‌పోతే ఇక జ‌నాల‌కు ఎవ్వ‌రికి న‌చ్చ‌కూడ‌ద‌న్న‌దే వీళ్ల క‌డుపు మంట సిద్ధాంతం.

అన్నికాలాలు ఒకలా ఉండవు.
మాయాబజార్ కాలం నడిచింది
పాతాళ భైరవి కాలం నడిచింది
శంకరాభరణం కాలం నడిచింది
మాతృదేవోభవ కాలం నడిచింది
గోరింటాకు కాలం నడిచింది
ఇపుడు యాక్షన్ సినిమాల కాలం నడుస్తుంది
ఎపుడూ శంకరాభరణాలే తీయాలా ? అవే హిట్ కావాలా ? జనం చూస్తున్నారు. రాజమౌళి ఏం తీస్తాడో తెలిసి మరీ చూస్తున్నారు.

అయినా కాని ఈ కుళ్ల‌కునే వాళ్లకు నొప్పేంటో అర్థం కావడం లేదు.
అయినా ఇప్పటికీ వీళ్లకు అర్థం కానిది ఏంటంటే… రాజమౌళి అన్ని సినిమాలు దాదాపు ఒకే కథ నడుస్తుంటుంది.
ఒక పెద్ద సమూహం… ఒక కర్కశుడి బారిన పడి రోధిస్తుంటుంది. అరాచకం రాజ్యమేలుతుంటుంది. అపుడు ఒక సేవియర్ వస్తాడు. కర్కశుడిని అంతరింపజేస్తాడు. బాధితులకు విముక్తి దొరుకుతుంది.
ఛత్రపతి కథ ఇదే.
విక్రమార్కుడి కథ ఇదే.
బాహుబలి కథ ఇదే.
త్రిబులార్ కథ కూడా ఇదే

SS Rajamouli సినిమా కథ సేమ్
యాక్షన్, డ్రామా, దర్శకత్వమే మారుతూ ఉంటాయి
మీరు ఎంత ఏడ్చినా #SSRajamouli మారడు
ఆయన కాలం నడిచినంత కాలం ఆయనపై ఏడుస్తూనే ఉండండి.

#దు:ఖీభవ #నన్ను చూసి ఏడవకురా అని రాజమౌళి కారు మీద రాయిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news