టాలీవుడ్ లో ఘట్టమనేని ఫ్యామిలీది ఐదు దశాబ్దాల సుదీర్ఘమైన చరిత్ర. సూపర్ స్టార్ కృష్ణ నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేశారు. అప్పటి తరం లెజెండ్రీ హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్నార్ లకు పోటీగా కృష్ణ తన సినిమాలు రిలీజ్ చేసేవారు. కృష్ణ నటించిన పదిహేను సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అయ్యేవి అంటే ఆయన ఎంత కష్టపడేవారో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కృష్ణకు నిర్మాతల హీరో అన్న పేరు ఉండేది. తాను నటించిన ఏ సినిమా అయినా ప్లాప్ అయ్యి నిర్మాతలకు నష్టం వస్తే వెంటనే ఆ నిర్మాతకు మరో సినిమా ఫ్రీగా చేసేందుకు డేట్లు ఇచ్చేసేవారు. అందుకే కృష్ణ చివరిదశలో ఆర్థికంగా బాగా నష్టపోయి ఆస్తులు కూడ పెట్టుకో లేకపోయారు అన్న ప్రచారం కూడా ఇండస్ట్రీలో ఉంది.
1960 – 80 మధ్యలో తెలుగు సినిమా అంతా ఎక్కువగా ఎన్టీఆర్ – ఏఎన్నార్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఆ ఇద్దరు హీరోలకు ఎంత మంది హీరోలు ఉన్నా కూడా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే కృష్ణ మాత్రం తనకంటూ ప్రత్యేకంగా బలమైన అభిమానుల మద్దతుతో అటు ఎన్టీఆర్‌తో పాటు ఇటు ఏఎన్నార్‌కు కూడా పోటీ ఇచ్చారు. చివరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా కూడా గెలిచారు. కృష్ణ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే భార్య ఇందిర ఉండగానే అప్పట్లో స్టార్ హీరోయిన్.. దర్శకురాలిగా ఉన్నా విజయనిర్మల ను కూడా రెండో పెళ్లి చేసుకున్నారు.
విజయనిర్మల స్వతహాగా మంచి కథా రచయిత.. దర్శకురాలు కావడంతో ఆమెతోనే ఎక్కువగా కృష్ణ ట్రావెల్ చేసే వారు. అదే సమయంలో కృష్ణ ఎక్కువగా విజయనిర్మలతోనే ఉండాల్సి రావడంతో కృష్ణ మొదటి భార్య ఇందిరకు, విజయనిర్మలకు మధ్య కొన్నాళ్లపాటు అంత సఖ్యత లేదని అంటారు. అయితే విజయనిర్మల కృష్ణ ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడంతో పాటు… ఆయనకు ఎప్పటికప్పుడు సపర్యలు చేయడంతో చివరకు విజయనిర్మల అంటే ఇందిరకు అభిమానం ఏర్పడింది. అప్పటినుంచి ఆ ఇద్దరూ సొంత అక్క.. చెల్లెళ్లులా కలిసిమెలిసి ఉన్నారు.
ఇక కృష్ణ – జయప్రద కాంబినేషన్లో ఏకంగా 42 సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో ఎక్కువగా సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి. విజయనిర్మల తర్వాత కృష్ణ ఎక్కువగా శ్రీదేవి మీద ఆశ పడే వారిని అప్పట్లో ప్రచారం నడిచింది. శ్రీదేవి – కృష్ణ కలిసి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి తెరమీద కనిపిస్తే ఆ క్రేజ్ వేరుగా ఉండేది. అందుకే కృష్ణ తన సినిమాల్లో ఏ హీరోయిన్ ను ప్రత్యేకంగా రిఫర్ చేయకపోయినా నిర్మాతలకు మాత్రం శ్రీదేవి డేట్లు బ్లాక్ చేసి పెట్టమని చెప్పేవారట.
శ్రీదేవితో తనకు వరుసగా సూపర్ హిట్లు రావడంతో ఆమెతో నటించేందుకు కృష్ణ ఎక్కువగా ఆసక్తి చూపే వారి సీనియర్ జర్నలిస్టు ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్ళి పోయి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కూడా.. కృష్ణతో ఆమెకు ఎంతో అనుబంధం కొనసాగింది.