టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన మోస్ట్ అవైటెడ్ మూవీ త్రిబుల్ ఆర్. టాలీవుడ్‌లోనే క్రేజీ స్టార్స్‌గా ఉన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఇద్దరూ కలిసి నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. రు. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ త్రిబుల్ ఆర్ రు. 1000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో బరిలోకి దిగుతోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమాకు రు. 225 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీ, తెలంగాణతో పాటు సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ అటు నార్త్‌లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది.
ఓవర్సీస్‌లోనే ఈ సినిమాకు వెయ్యి థియేటర్లు కేటాయిస్తున్నారంటే త్రిబుల్ ఆర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుస్తోంది. రిలీజ్‌కు మరో 20 రోజుల టైం ఉన్నా కూడా ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలకు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. 20 రోజుల ముందు యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేస్తే ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లు వచ్చాయంటే సినిమా క్రేజ్ ఏంటో తెలుస్తోంది.
త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి – మహేష్‌బాబు కాంబినేషన్లో సినిమా ఖాయమైంది. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ – త్రివిక్రమ్ సినిమా ఫినిష్ అయిన వెంటనే రాజమౌళి – మహేష్ సినిమా ఉంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా వచ్చిన అప్‌డేట్ కూడా కళ్లు చెదిరిపోయేలా ఉంది.
ఈ సినిమాలో జాన్వీకపూర్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారట. బడ్జెట్ ప్రాథమికంగా రు. 200 కోట్లు అంటున్నా.. ఇది ఇంకా పెరిగిపోతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో యూనిట్ బిజీగా ఉంది. రచయిత విజయేంద్ర ప్రసాద్ అదిరిపోయే స్టోరీ రెడీ చేశారు. ఇక ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్ కథా నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఇక ప్రముఖ దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్‌కు విజయేంద్రప్రసాద్, రాజమౌళి వీరాభిమానుల అట. ఆయన నవలలను వీరు విపరీతంగా ఇష్టపడతారట. ఆ నవలల స్ఫూర్తి ఆధారంగానే ఈ సినిమా స్క్రిఫ్ట్ రాశామని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కువుగా ఆఫ్రికా నేపథ్యంలోనే సాగుతుందట. ఏదేమైనా రాజమౌళి మరో అద్భుత లోకంలోకి ఈ సినిమా ద్వారా మనలను తీసుకు వెళ్లబోతున్నారన్నది అయితే అర్థమవుతోంది.