చిత్ర సినిమాతో 2000 సంవత్సరంలో ఉదయ్ కిరణ్ అనే హీరో ఒక్కసారిగా టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ అయిపోయాడు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాతోనే తేజ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఉదయ్‌కిరణ్ – రీమాసేన్ హీరో, హీరోయిన్లు. రు. 50 లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రు. 7 కోట్ల షేర్ రాబట్టింది. చిత్రం హిట్ అయినా ఉదయ్‌ను చాలా మంది లైట్ తీస్కొన్నారు. తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే సూపర్ డూపర్ హిట్లు. యూత్‌లో వారసులు అయిన స్టార్ హీరోలకే షాక్ ఇచ్చేంత ఇమేజ్ వచ్చేసింది.
స్టార్ డైరెక్టర్లు, బ్యానర్లు ఉదయ్‌కిరణ్ వెంట పడడం మొదలు పెట్టాయి. ఈ లోగా మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మితకు ఉదయ్‌కిరణ్‌తో ఎంగేజ్మెంట్. ఒకేసారి 11 పెద్ద బ్యానర్ల నుంచి ఉదయ్‌కిరణ్‌కు ఆఫర్లు. ఆ టైంలో ఉదయ్‌కిరణ్ బర్త్ డేకు ఏకంగా 10కు పైగా పెద్ద బ్యానర్లు తమ బ్యానర్లో ఉదయ్‌తో సినిమా అనౌన్స్ చేస్తూ ప్రకటనలు ఇచ్చాయి. ఉదయ్ ఒక్కసారిగా టాలీవుడ్‌లో సెన్షేషన్ అయిపోయాడు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉదయ్ వెంట పడడం ప్రారంభించారు. లవర్‌బాయ్‌గా అప్పట్లో యూత్‌లో నిలిచిపోయాడు.
నాలుగో సినిమా శ్రీరామ్ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్. ఇక ఉదయ్ – సుస్మిత ఎంగేజ్మెంట్ అప్పట్లో ఇండస్ట్రీ అంతా హైలెట్ అయ్యింది. 2003లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్‌కు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, పిన్నలు అందరూ తరలి వచ్చారు. ఉదయ్‌కిరణ్ మెగాస్టార్‌కు అల్లుడు అవుతున్నాడని.. మనోడి దశ మారిపోతుందని ఒక్కటే ప్రచారం. ఉదయ్ బయటకు వస్తే ఆ క్రేజ్ వేరుగా ఉండేది. ఇంతలో మెగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉదయ్‌కు టర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.
ఏ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేదు.. ఆస్తులూ లేవు.. మరి మెగాస్టార్ ఉదయ్‌ను ఎందుకు తన అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నారంటే.. చిరు కుమార్తె సుస్మితే ఉదయ్‌ను ఇష్టపడడంతో పాటు ఈ విషయాన్ని తండ్రికి స్వయంగా చెప్పిందని అంటారు. చిరు సైతం కుమార్తె కోరిక మేరకే ఉదయ్‌ను అల్లుడిని చేసుకోవడంతో పాటు ఇల్లరికం కూడా తీసుకువెళ్లాలని డిసైడ్ అయిపోయాడని ప్రచారం. పెళ్లికి ముందే కాబోయే కఫుల్ పార్కులు, సినిమాలు, షికార్లు, విదేశీ పర్యటనలు కూడా చేశారు.
సుస్మిత అయితే ఉదయ్ లేకపోతే తాను లేను అన్నట్టుగా ఉండేది. ఏమైందో గాని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ బిహేవియర్ సుస్మితకు నచ్చక ఆమె డ్రాప్ అయ్యిందన్నారు.. కాదు కాదు ఉదయ్ ప్రవర్తనపై మెగా కాంపౌండ్ సీక్రెట్ నిఘా పెట్టింది.. అక్కడ తేడా కొట్టడంతోనే పెళ్లి చేయలేదని అప్పట్లో ఎన్నెన్నో అనుకున్నారు. ఏదేతేనేం ఎవ్వరికి ఏం కాలేదు. ఉదయ్ జీవితం ఒక్కసారిగా తల్లకిందులు అయిపోయింది.
చిరంజీవి అల్లుడు అన్నగానే వచ్చిన ఆఫర్లు అన్నీ వెనక్కు వెళ్లిపోయాయి. పెద్ద నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్‌లు తీసేసుకున్నారు. విధి కూడా ఉదయ్‌తో ఆటలాడుకుంది. ఆ తర్వాత ఒక్క హిట్టూ రాలేదు. ఆ వెంటనే సుస్మితకు చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన విష్ణుప్రసాద్‌తో పెళ్లి చేశాడు చిరు. ఉదయ్ తర్వాత చాలా నిరాడంబరంగా విషిత అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు.
ఛాన్సులు లేవు.. వరుస ప్లాపులు.. లైఫ్ ఇచ్చిన తేజ తర్వాత చేసిన సినిమానూ ప్లాపే.. చివరకు తానే కొంత పెట్టుబడి పెట్టి జై శ్రీరామ్ సినిమా చేస్తే అది కూడా ప్లాపే. చివరకు 2014లో మానిసిక క్షోభతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు. అలా స్టార్ హీరో కావాల్సిన ఉదయ్ జీవితం ముగిసింది. పూర్తిగా తెలియదు కాని అటు సుస్మిత జీవితం కూడా ఏమంత బాగాలేదనే అంటున్నారు. కొన్నేళ్ల కాపురం తర్వాత భర్తకు దూరమై హైదరబాద్ వచ్చేసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. విడాకులు వచ్చాయో లేదో కాని ఆమె జీవితం కూడా పెటాకులు అయ్యిందనే అంటున్నారు. విధి ఎంత వైచిత్రమైందో ఈ జంట కథ చూస్తేనే అర్థమవుతోంది.