ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాలీవుడ్లో యావరేజ్ టాక్‌తో స్టార్ట్ అయిన పుష్ప ఏకంగా రు. 100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. పుష్ప ఓవరాల్‌గా రు. 365 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. పుష్ప సాధించిన ఈ అప్రతిహత విజయం బన్నీకి తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పటికే మల్లూవుడ్‌లో బన్నీకి తిరుగులేని క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ను అటు నార్త్‌లో కూడా విస్తరించుకోవాలని ప్లాన్లు వేస్తున్నాడు.
ప్రస్తుతుం బన్నీ చేస్తోన్న పుష్ప 2 సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించాలన్న కోరికతో ఉన్నాడు. అల్లు అరవింద్ సైడ్ నుంచి రాజమౌళికి గేలం వేసే ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి. రాజమౌళి – బన్నీ సినిమా ఎప్పుడు పడినా బన్నీ తిరుగులేని నేషనల్ స్టార్ అయిపోతాడు. అయితే అంతకంటే ముందే బన్నీ బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్‌తో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు.
ఈ విషయంలో చాలా సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు నార్త్‌లో యూట్యూబ్‌కే పరిమితం అయిన బన్నీ తన క్రేజ్‌ను ఇప్పుడు థియేట్రికల్ క్రేజ్‌తో కూడా పెంచుకోవాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో డైరెక్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. తాజాగా బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలాబన్సాలీ ఆఫీస్‌కు వెళ్లిన బన్నీ అక్కడ బన్సాలీని కలిసి చర్చలు జరిపినట్టు మ్యాటర్ బయటకు పొక్కింది.
బన్సాలీ నిర్మాతగాను, దర్శకుడిగాను యాక్షన్ ఎంటర్టైనర్లు తెరకెక్కించడంలో చాలా పవర్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక బన్సాలీ సౌత్‌లో మంచి కథాబలంగా వచ్చిన సినిమాలను హిందీలో తెరకెక్కించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ – బన్సాలీ కాంబోలో పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయ్. ఇటు బన్నీకి పాన్ ఇండియా మార్కెట్ కావాలి. ఈ టైంలో బన్సాలీ లాంటి క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేస్తే బన్నీకి రాజమౌళి సినిమా నాటికి బాలీవుడ్‌లోనూ ఓ మ్యాప్ ఏర్పడిపోయి ఉంటుంది.
ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తారని అంటున్నారు. గతంలో ఈ బ్యానర్ హిందీలోనూ సినిమాలు తీసి హిట్ కొట్టింది. ఇప్పుడు బన్నీకి ఉన్న మార్కెట్ నేపథ్యంలో ఈ సినిమాను ఎంత బడ్జెట్ అయినా తీసుకోవచ్చు.