భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా RRR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మానియా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు మధ్యలో ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా RRR 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇండియాలో తెలుగు, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మూడేళ్లుగా ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ప్రమోషన్లు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కర్నాకటలోని చిక్‌బళ్లాపూర్‌లో తారక్, చెర్రీ, రాజమౌళి పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు తెలుగునాట నుంచి కూడా భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. పైగా కర్నాకట వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కేశవరెడ్డి సుధాకర్‌తో పాటు సీఎం బసవరాజ్ బొమ్మై సైతం స్వయంగా హాజరై ఈ సినిమా చూసి దేశభక్తిని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.
అసలు ఇక్కడకు వచ్చిన జనాలను చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. అయితే ఇదే వేదిక మీద కన్నడ హీరో శివరాజ్‌కుమార్ ఈ సినిమాను కన్నడ భాషలోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని కోరారు. అయితే ఇప్పుడు రాజమౌళి ఆపని చేయడం లేదు. కన్నడ సీమ అంతటా కూడా తెలుగు భాషలోనే త్రిబుల్ ఆర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇక హిందీలో కూడా ఎలాగూ రిలీజ్ అవుతోంది. బెంగళూరు లాంటి మోట్రో సిటీస్‌లో ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతోంది.
ఇక కన్నడ ప్రజలు కూడా కన్నడ భాషలో సినిమా రిలీజ్ చేయకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కన్నడ సీమ అంతటా కూడా తెలుగులో రిలీజ్ చేస్తే తెలుగు భాష అర్థం చేసుకునే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా బాగా అర్థమవుతుందని.. తమకు ఇబ్బంది తప్పదని కన్నడ ప్రేక్షకులు అసంతృప్తితో ఉన్నారు. పైగా శివరాజ్‌కుమార్ రిక్వెస్ట్ చేసినా కూడా రాజమౌళి పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహంతోనే ఉన్నారు.
దీంతో కన్నడ నాట ఇప్పుడు సోషల్ మీడియాలో #boycottRRR హ్యాష్‌ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది. రాజమౌళి కన్నడ భాషలో రిలీజ్ చేయకుండా కేవలం తెలుగులో రిలీజ్ చేసి మార్కెట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారని..కన్నడ ప్రేక్షకుల మనోభావాలు పట్టించుకోవడం లేదని.. తాము త్రిబుల్ ఆర్ బాయ్‌కాట్ చేస్తామని.. అవసరం అయితే తాము కేజీఎఫ్ 2ను బాగా ఎంజాయ్ చేస్తామని కామెంట్లు పెడుతున్నారు.