పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కిన భీమ్లానాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వీరంగం ఆడేస్తోంది. నైజాంలోనూ, రెస్టాప్ ఇండియా, ఓవర్సీస్‌లో ఈ సినిమా వసూళ్ల విజృంభణకు అడ్డే లేదు. విచిత్రం ఏంటంటే ఏపీలో టిక్కెట్ల రేట్లు తక్కువుగా ఉన్నా, ఫస్ట్ డే అనుకున్న స్థాయిలో షోలు పడకపోయినా కూడా అక్కడ కూడా భీమ్లానాయక్ వసూళ్లు బాగానే ఉన్నాయి. మల్లూవుడ్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియమ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాల దర్శకుడు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటాలంటే ఇంకా చాలా వసూళ్లు రాబట్టాల్సి ఉన్నా ఓవర్సీస్‌లో మాత్రం ఇప్పటికే భారీ లాభాల్లోకి వెళ్లిపోయింది. కేవలం ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికే ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల మార్క్ వసూళ్లు దాటేసింది. ఓవరాల్‌గా రు . 15 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టేసింది.
లేటెస్ట్ గా అయితే ఈ సినిమాను అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రైమ్ మీడియా సంస్థ వారు భీమ్లా నాయక్ పెర్ఫామెన్స్ పై అదిరిపోయే విషయం చెప్పారు. నార్త్ అమెరికాలో భీమ్లానాయక్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందట. అక్కడ ఇండియా సినిమాలను బీట్ చేయడంతో పాటు హాలీవుడ్ సినిమాలను సైతం పక్కన పెట్టేసి నెంబర్ 1 ఇండియా సినిమాగా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నట్టు చెప్పారు.
దీనిని బట్టి చూస్తే ఓవర్సీస్‌లో భీమ్లానాయక్ లాంగ్ రన్‌లో చాలా సులువుగానే 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.