Moviesమెగాస్టార్ `భోళా శంకర్` స్టైలీష్ ఫ‌స్ట్ లుక్‌... ఏదో తేడా కొడుతోందిగా...!

మెగాస్టార్ `భోళా శంకర్` స్టైలీష్ ఫ‌స్ట్ లుక్‌… ఏదో తేడా కొడుతోందిగా…!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న చిరు ఆ వెంట‌నే బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వాల్తేర్ వీర‌య్య‌, మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్‌ఫాద‌ర్‌, మోహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ సినిమాలు చేస్తున్నారు. ఇంకా చిరు లైన‌ఫ్‌లో చాలా సినిమాలే ఉన్నాయి. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే తాజాగా మ‌హా శివ‌రాత్రి కానుక‌గా భోళా శంక‌ర్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

చిరంజీవి- మెహర్ రమేష్- అనిల్ సుంకర కాంబినేషన్ లో రూపొందుతున్న మెగా భారీ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. వైబ్ ఆఫ్ భోలా అనే ఫస్ట్ లుక్ పోస్టర్ చిరంజీవిని చాలా స్టైలీష్ లుక్‌లో ప్ర‌జెంట్ చేశాడు ద‌ర్శ‌కుడు ర‌మేష్‌. కారుపై కూర్చొని, డ్రెస్సింగ్‌, సిట్టింగ్ పోజిష‌న్ నుంచి చేతిలో చైన్ తిప్పే స్టైల్ చూస్తుంటే ఆ మాసిజానికి ఎవ‌రైనా ఫిదా కావాల్సిందే. ఈ స్టిల్ ఏదో యాక్ష‌న్ సీక్వెన్స్‌కు సంబంధించింది అయ్యి ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

లుక్ బాగున్నా మెగా అభిమానుల‌కే కాకుండా.. స‌గ‌టు సినీ అభిమానుల‌కు కూడా ఏదో తేడా కొట్టేస్తోంది. చిరు న‌ట‌న‌, ఆయ‌న లుక్ ఇవ‌న్నీ ఓకే.. ఇక్క‌డ డౌట్ అల్లా క‌థ‌తో పాటు మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్ మీదే. మెహ‌ర్ ర‌మేష్ కెరీర్‌లో నాలుగు సినిమాలు చేస్తే చెప్పుకోవ‌డానికి ఒక్క హిట్టూ లేదు. ప్ర‌భాస్ హీరోగా వ‌చ్చిర రీమేక్ బిల్లా మ‌క్కీకి మ‌క్కీ దింపేశాడు. ఓవ‌ర్ బ‌డ్జెట్‌తో లాభాలు లేవు. ఎన్టీఆర్ కంత్రి బిలో యావ‌రేజ్‌.. శ‌క్తి గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. అశ్వ‌నీద‌త్ ఇన్నేళ్ల‌కు కాని కోలుకోలేదు.

ఇక వెంక‌టేష్‌తో తీసిన షాడోతో ఆ నిర్మాత ప‌రుచూరి కిరీటీ అడ్ర‌స్ లేరు. 2013లో షాడో వ‌చ్చింది.ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్‌కు క‌థ చెప్పేందుకు అపాయింట్‌మెంట్ అడిగితేనే ఎవ్వ‌రూ ఒప్పుకోలేదు. అస‌లు ర‌మేష్‌ను క‌లిసేందుకే భ‌య‌ప‌డిపోయారు. ఆ త‌ర్వాత మ‌హేష్‌బాబుకు ద‌గ్గ‌రై కొన్ని యాడ్స్‌ను మ‌హేష్‌తో డైరెక్ట్ చేశాడు. అయితే ర‌మేష్ టాలెంట్ ఏంటో తెలిసిన మ‌హేష్ మెహ‌ర్ ర‌మేష్‌ను అక్క‌డితో ఆపేశాడు. అక్క‌డి వ‌ర‌కే ఉంచాడు.

ఇక మెగా కాంపౌండ్‌లో ఏళ్ల‌కు ఏళ్లుగా తిరుగుతూ చివ‌ర‌కు చిరును ఏదోలా ఇంప్రెస్ చేసి సినిమా ఛాన్స్ కొట్టేశాడు. అక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది. పోనీ తీస్తోంది ఒరిజిన‌ల్ క‌థ కాదు.. త‌మిళంలో ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం వ‌చ్చిన వేదాళం సినిమా రీమేక్‌. ఈ సినిమా క‌థ ఓ కుక్క‌రాడ్ క‌థ అని మెగా అభిమానులే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుసగా కుక్క‌రాడ్ రీమేక్‌లు చేసి ఎలా దెబ్బ‌తిన్నాడో ఇప్పుడు ఇది కూడా అలాంటి క‌థే అంటున్నారు.

పైగా మెహ‌ర్ ర‌మేష్ టేకింగ్ వ‌ర‌కు, హీరోను చూపించే విధానం వ‌ర‌కు స్టైలీష్‌గానే ఉంటుంది త‌ప్ప అస‌లు సినిమా స్టార్ట్ అయ్యాక క‌థ ఎటు నుంచి ఎటు పోతుందో తెలియ‌దు. ఇక బ‌డ్జెట్ విష‌యంలో కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టించేస్తాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే కాస్ట్‌లీ ఆఫీస్‌, కాస్ట్‌లీ ఫ‌ర్నీచ‌ర్‌, కాస్ట్ లీ భోజ‌నాలు అంటూ ఇప్ప‌టికే నిర్మాత‌ల‌కు చాల వ‌ర‌కు చేతిచ‌మురు వ‌దిలించేశాడ‌ట‌. దీంతో మెగా అభిమానుల్లో ఫ‌స్ట్ లుక్ వ‌చ్చింద‌న్న ఆనందం కాన్నా చాలా టెన్ష‌న్లే క‌నిపిస్తున్నాయి.

ఇక మెగాస్టార్ సరసన మరోసారి మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు కి సోదరి పాత్రలో నటిస్తుంది. అలాగే మహతి సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news