బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. బాలయ్య ఎన్ని సినిమాలు చేసినా మల్టీస్టారర్ సినిమాలు చేయాలని ఆయన అభిమానులే కాకుండా.. తెలుగు సినిమా అభిమానులు కూడా కోరుతున్నారు. మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఇటీవల ఎక్కువ అవుతోంది. సీనియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆరే కలిసి నటిస్తున్నారు. బాలయ్య ఏ పాత్ర అయినా అవలీలగా చేసేస్తారు. తాజాగా అఖండలో అఘోరాగా అదర గొట్టేశాడు. ఇక ఇప్పుడు మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలే ఉన్నాయి.
ఎన్టీఆర్ – బాలయ్య, బాలయ్య – కళ్యాణ్‌రామ్ ఇలా చాలా కాంబినేషన్లు అనుకుంటున్నా అవేవి సెట్ కావడం లేదు. ఇక తనయుడు మోక్షజ్ఞ – బాలయ్య అయినా కలిసి నటిస్తారేమోనని గత నాలుగేళ్లుగా నందమూరి అభిమానులు ఎన్నో ఆశలతో ఉన్నారు. అవి కూడా ఇప్పట్లో నెరవేరేలా లేవు. అయితే ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య ఓ యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
పూరి జగన్నాథ్ శిష్యుడు అయిన పెట్ల పరశురాం మహేష్‌బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 12న థియేటర్లలోకి రానుంది. ఇక పరశురాం బాలయ్యతో సినిమా కోసం చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా కుదరడం లేదు. పరశురాం ఇప్పటికే బాలయ్యకు ఓ కథ చెప్పి ఉన్నాడు. గతంలో మనోడు నారా రోహిత్‌తో సోలో సినిమా చేశాడు. ఈ సినిమా ఫ్యామిలీ సినిమాగా ప్రశంసలు అందుకోవడంతో పాటు రోహిత్‌కు మంచి హిట్ ఇచ్చింది.
బాలయ్య కూడా పరశురాం చెప్పిన కథను మెచ్చుకోవడంతో పాటు తన ఇమేజ్‌కు తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేయమని సూచించాడట. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా పూర్తయ్యాక ఆ మార్పులు చేసి ఆ కథతోనే బాలయ్య హీరోగా సినిమా చేయాలని పరశురాం పట్టుదలతో ఉన్నాడు. అయితే ఈ కథలో బాలయ్యతో పాటు మరో యంగ్ హీరో కూడా కనిపించబోతున్నాడట. సెకండాఫ్‌లో ఆ యంగ్ హీరో పాత్ర ఉంటుందని తెలుస్తోంది.
సర్కారు వారి పాట సినిమా కంప్లీట్ అయ్యాక పరశురాం ఈ సినిమాపై వర్క్ స్టార్ట్ చేస్తాడు. సర్కారు వారి పాట హిట్ అయితే బాలయ్య – పరశురాం మల్టీస్టారర్‌పై అంచనాలు మామూలుగా ఉండవు.