ముదురు ముద్దుగుమ్మ, స్వీటీబ్యూటీ అనుష్క ఇన్నేళ్లుగా సైలెంట్‌గా ఉంది. రెండేళ్లుగా ఆఫర్లు వస్తున్నా కూడా ఆమె దేనికి ఓకే చెప్పడం లేదు. ఇప్పటికే వయస్సు నాలుగు పదులకు చేరుకుంది. సినిమాలు రావడం లేదు. ఇప్పుడు అంతా తెలుగుతో పాటు సౌత్‌లో కుర్ర హీరోయిన్లు రష్మిక, పూజ, కీర్తి సురేష్ లాంటి వాళ్ల హంగామానే నడుస్తోంది. వీళ్ల పోటీ దెబ్బతో అనుష్కకు అవకాశాలు తగ్గాయి. అనుష్క ఫేస్ కూడా మారింది.
కొన్నాళ్ల క్రితం అనుష్క యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తుందన్న టాక్ వచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని వెళ్లిపోతోందని.. అందుకే ఆ సినిమా ఊసే లేకుండా పోయిందని అన్నారు. అయితే తన బర్త్ డే సందర్భంగా ఆ పుకార్లకు అనుష్క చెక్ పెట్టేసింది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. అనుష్కకు ఇది 48వ సినిమా. మహేష్ పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
యూవీలో అనుష్క మిర్చి. భాగమతి సినిమాలు చేసింది. రెండూ మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా చేస్తే ఆమెకు యూవీలో హ్యాట్రిక్ సినిమా అవుతుంది. ఈ సినిమాకు మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే అనుష్క ఇప్పుడు కోలీవుడ్‌లో ఓ సినిమాకు ఓకే చెప్పింది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్. విజయ్ తో నాన్న సినిమాకు అనుష్క పనిచేసింది. ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు.
ప్రయోగాత్మక పాత్రల్లో నటించడం అనుష్కకు ఎప్పుడూ కొత్తకాదు. ఆమె చివరిసారిగా నిశ్శబ్దం సినిమాలో నటించింది. ఏఎల్. విజయ్ ఎవరో కాదు అమలాపాల్ మాజీ భర్త అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్‌తో ఆమె చేసే సినిమా కూడా మాంచి ప్రయోగాత్మక సినిమా అని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది. మరి ఈ సినిమా అనుష్క కెరీర్‌ను ఈ ముదురు వయస్సులో టర్న్ చేస్తుందో ? లేదో ? చూడాలి.