30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి తెలుగు సినిమా రంగంలో ఓ సంచలనం. ఆయన ఇండస్ట్రీలో ఇన్నేళ్ల నుంచి ఉంటున్నారు. మనసులో ఏముందో కాని బయటకు మాత్రం ఓపెన్‌గానే ఉంటారు. సినిమా రంగంలో ఆయన తనకంటూ సపరేట్ ఇమేజ్, సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని ఓ డైలాగ్‌తోనే పదే పదే పాపులర్ అవ్వడంతో పాటు.. అలాగే ప్రేక్షకుల మైండ్‌లోకి ఎక్కేశాడు.
పృథ్వి సినిమా రంగంలోనే కాదు.. అటు రాజకీయాల్లోనూ ఉన్నారు. ముందు నుంచి వైసీపీ ఫాలోవర్‌గా, జగన్ అభిమానిగా ఉన్న పృథ్వి గత ఎన్నికలకు ముందు ఏపీలో వైసీపీ అధికారంలోకి రావాలని విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సైతం పృథ్విని టీటీడీ భక్తిఛానెల్ చైర్మన్‌గా నియమించారు. అయితే ఆరు నెలలకే వివాదాల్లో చిక్కుకోవడంతో పృథ్వి తన పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత ఆయన పూర్తి సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు చెప్పారు. ఓపెన్‌గా ఉండే కుటుంబం కోసం తాను ఏం చేశానో అవన్నీ తనకు మైనస్ అయ్యాయని వాపోయాడు. ఇక పృథ్వి మొదటి భార్యకు దూరం కావడం.. తర్వాత తన దగ్గర పనిచేసే ఓ అమ్మాయి తనను పృథ్వి పెళ్లి చేసుకుంటానని.. వాడుకుని మోసం చేశాడని బయట రచ్చ చేయడం తెలిసిందే.
ఇక కెరీర్ పరంగా తాను చాలా స్ట్రగుల్ అయ్యానని పృథ్వి చెప్పారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఖడ్గం సినిమా తర్వాత లౌక్యం చాలా స్ట్రగుల్ పడ్డానని.. తనకు వెన్నంటి ధైర్యం చెప్పిన వాళ్లు.. ఆదుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారని తెలిపాడు. ఇక సినిమాలో తమకు ఓ రోజు షూటింగ్ ఉందని చెపుతారని.. ఆ రోజు షూటింగ్ చేసి ఇంటర్వెల్‌కు ముందు రెండు సీన్లు.. ఇంటర్వెల్ తర్వాత రెండు సీన్లు వేసి రు. 20 వేలు ఇచ్చి పంపుతారని బాంబు పేల్చాడు.
అయితే బయట బంధువుల రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు వస్తాయని ప్రచారం చేస్తారని.. ఇక తమకు వచ్చే రెమ్యునరేషన్‌లో కూడా జీఎస్టీలు, ఐఎస్‌డీలు, మేనేజర్ కమీషన్లు.. ఇతర ఖర్చులు ఇవన్నీ పోయాక మిగిలేది ఏమీ ఉండదని .. బయట ప్రచారం మాత్రం వేరే ఉంటదని చెప్పాడు.