Moviesయంగ్ హీరోలు నిఖిల్ - సుశాంత్ బ్రేక‌ప్ క‌హానీ ఇదే..!

యంగ్ హీరోలు నిఖిల్ – సుశాంత్ బ్రేక‌ప్ క‌హానీ ఇదే..!

టాలీవుడ్‌లోనే మోస్ట్ రొమాంటిక్ క‌పుల్‌గా పేరున్న హీరో నాగ‌చైత‌న్య , హీరోయిన్ స‌మంత విడిపోయారు. అటు కోలీవుడ్‌లో ధ‌నుష్ – ఐశ్వ‌ర్య విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఓ సీనియ‌ర్ హీరో చాలా లేట్ వ‌య‌స్సులో పెళ్లి చేసుకుని కూడా ఇప్పుడు త‌న భార్య‌కు విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో అంతా పెటాకుల సీజ‌న్ న‌డుస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై ఇప్పుడు ఇద్ద‌రు యంగ్ హీరోలు స్పందించారు. వీరిద్ద‌రిలో ఒక‌రు మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ హీరో అయితే.. మ‌రొక‌రు పెళ్ల‌యిన హీరో.. వారిద్ద‌రు ఎవ‌రో కాదు సుశాంత్‌, నిఖిల్‌.

నిఖిల్ తాను ప్రేమించిన భీమ‌వ‌రం అమ్మాయిని క‌రోనా టైంలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. నిఖిల్‌ను బ్రేక‌ప్ గురించి అడిగితే అస‌లు త‌డుముకోకుండా ఆన్స‌ర్ ఇచ్చాడు. బ్రేక‌ప్స్‌పై కాస్త ఫ‌న్నీగాను.. మ‌రికాస్త సీరియ‌స్‌గాను నిఖిల్ స్పందించాడు. బ్రేక‌ప్స్‌పై మీరు నా అభిప్రాయం అడుగుతున్నారు.. ఈ ప్ర‌శ్న‌కు తాను ఆన్స‌ర్ చెప్ప‌ను అని.. ఇంట్లో కూర్చొని మా ఆవిడ ఈ ప్రోగ్రామ్ చూస్తుంది.. మొన్నే నాకు పెళ్ల‌య్యింది.. అప్పుడే బ్రేక‌ప్ అంటే చాలా క‌ష్టం.. అస‌లు అలాంటి ఉద్దేశాలు కూడా నాకు లేవు… నా మ్యారేజ్ లైఫ్ ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తున్నాను అని నిఖిల్ చెప్పాడు.

తాను జీవితాన్ని ఎంత ప్రేమిస్తానో… భార్య‌ను కూడా అంతే ప్రేమిస్తాను అని.. అప్పుడు బ్రేక‌ప్స్ అనేవే ఉండ‌వ‌ని నిఖిల్ చెప్పాడు. ఇక అక్కినేని మేన‌ళ్లుడు సుశాంత్ కూడా బ్రేక‌ప్స్‌పై స్పందిస్తూ త‌న లైఫ్‌లో కూడా చిన్న‌చిన్న బ్రేక‌ప్‌లు ఉన్నాయ‌ని చెప్పాడు. ఇక బ్రేక‌ప్స్‌పై స్పందించ‌డానికి తాను స‌రైన వ్య‌క్తిని కూడా కాద‌ని.. నాకు ఇంకా పెళ్లి కాన‌ప్ప‌ట‌కీ.. కాలేజ్ టైం నుంచే త‌న‌కు బ్రేక‌ప్స్ ఉన్నాయ‌ని చెప్పాడు.

బ్రేక‌ప్స్ అయితేనే మ‌నిషి చాలా బెట‌ర్‌గా త‌యార‌వుతాడ‌ని.. పెళ్లి త‌ర్వాత బ్రేక‌ప్ గురించి తాను మాట్లాడ‌లేను అని… త‌న‌కు ఇంకా పెళ్లి కాలేదుగా అని చెప్పాడు. ఏదేమైనా ఈ ఇద్ద‌రు యంగ్ హీరోలు బ్రేక‌ప్స్‌పై వివిధ ర‌కాలుగా స్పందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news