మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి – రామ్‌చరణ్ కాంబోలో కొరటాల డైరెక్ట్ చేసిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం చిరు ఏకంగా రెండున్నర సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆచార్య థియేటర్లలోకి వస్తుండడంతో ఇప్పుడు మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమా తర్వాత మళయాళ హిట్ సినిమా లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చేస్తున్నారు. మోహనరాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది.
ఇక కోలీవుడ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌లో కూడా చిరు నటిస్తున్నారు. డిజాస్టర్ల దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనుంది. భోళా శంకర్ అనే టైటిల్ తో ఈ సినిమా వస్తోంది. కీర్తీ సురేష్ చిరు చెల్లిగా నటిస్తోన్న ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇక బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కూడా పట్టాలు ఎక్కింది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్ అనుకుంటున్నారు.
ఇదే సమయంలో చిరు వెంకీ కుడుములతో కూడా మరో సినిమా చేసేందుకు ఓకే అన్నారు. ఈ సినిమా లో హీరోయిన్గా ముందుగా శృతీహాసన్‌ను అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్‌లో మరో హీరోయిన్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మాస్టర్ బ్యూటీ మాళవిక మోహన్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో మాళవిక మోహన్ మరీ బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో కావాల్సినంత రచ్చ చేస్తోంది.
ఆమె బికినీ ఫొటోలు అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మలే చిన్నబోయేలా ఉంటాయి. అందాల విందు చేయడంలో మాళవిక ఏ మాత్రం మొహమాట పడదని కూడా అంటారు. అలాంటి మాళవిక ఏకంగా మెగాస్టార్ సినిమాలో నటించడంతో పాటు అందాల విందు చేస్తే మెగా అభిమానులకు వీనుల విందు మామూలుగా ఉండదు. మాళవిక ఇప్పటికే కోలీవుడ్ క్రేజీ హీరో విజయ్ పక్కన మాస్టర్ సినిమాలో నటించింది. ఇప్పుడు చిరు పక్కన అంటే ఆమె క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం. అయితే సీనియర్ హీరో పక్కన బోల్డ్‌గా చేస్తే మామూలు రచ్చ ఉండదు.