పోస్టర్‌తోనే ఈ సినిమాలో ఏదో ఉందన్న అంచనాలు పెంచుకున్న డి జు టిల్లు ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. సితార సంస్థ బ్రాండ్ ఉండడం… ఇటీవల యూత్‌కు బాగా కనెక్ట్ అయిన సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు ఉన్నాయి. ఈ రోజు థియేటర్లలోకి వచ్చి డి జె టిల్లు అదిరిపోయిందనే అంటున్నారు. చిన్న చిన్న ఫంక్షన్స్‌లో డిజెగా పనిచేసే ఓ ఈజీ గోయింగ్ హైదరాబాదీ కుర్రాడు ఓ అమ్మాయి ట్రాపులో పడి ఎలాంటి తిప్పలు పడ్డాడు అన్న కథాంశంతో దీనిని తెరకెక్కించారు. ఇందకు డి జె టిల్లు అంటే బాలగంగాధర్ తిలక్‌లోని చివరి మూడు అక్షరాలు. పేరులోనే మాంచి ట్విస్ట్ ఇచ్చారు.
సినిమాలో టిల్లు పాత్ర తప్పా ఏ పాత్ర కూడా ఉన్నతమైందిగా ఉండదు. సినిమాలో మర్డర్ క్రైం, ఇన్వెస్టిగేషన్ లాంటివి ఉన్నా అన్నీ కామెడీ రంగులోనే ఉంటాయి. ఎలాంటి మోరల్ విలువలు అక్కర్లేదు. కేవలం యూత్‌ను కనెక్ట్ చేస్తూ కాసేపు నవ్వుకోవడానికి మాత్రమే తీసిన సినిమా ఇది. కథ ఎంత బాగా తయారు చేసుకున్నారంటే ప్రతి రెండు నిమిషాలకు ఒక్కసారన్నా హాలంతా గొల్లున నవ్వేలా సీన్లు డిజైన్ చేసుకున్నారు. తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు, టైమింగ్ విషయంలో సిద్ధు నవీన్ పోలిశెట్టిని ఫాలో అయినట్టుగా ఉంది.
హీరోయిన్ నేహాశెట్టి డార్క్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించింది. కథ, కథనాలు వెతుక్కుంచూ కూర్చోవడం ఈ సినిమాలో కష్టం. ఇది కామెడీ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతుందో కూడా అంచనా వేయలేం. మరీ జాతిరత్నాలులా పూర్తి క్లీన్ కామెడీ కాదు. ఒక్కో చోట ఏ రేటెడ్ సీన్లు ఉన్నాయి. సితారా వాళ్లు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. లాస్ట్ మినిట్‌లో సినిమా కోసం థమన్‌తో వర్క్ చేయించడం కూడా కలిసి వచ్చింది. సినిమాకు సిద్ధు ఇచ్చిన డైలాగులు పిచ్చెక్కించాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. ఇక చివర్లో ట్విస్ట్ అన్నట్టు డి జె టిల్లు – 2 కూడా ఉంటుందని చెప్పారు. ఓవరాల్‌గా బొమ్మ అయితే అదిరిపోయింది.