Moviesచిరంజీవి - వెంక‌టేష్‌కు ఒక్క‌సారే మ‌ర్చిపోలేని షాక్ ఇచ్చిన బాల‌య్య‌...!

చిరంజీవి – వెంక‌టేష్‌కు ఒక్క‌సారే మ‌ర్చిపోలేని షాక్ ఇచ్చిన బాల‌య్య‌…!

తెలుగు గ‌డ్డ‌పై సంక్రాంతి అంటే ఇప్ప‌డే కాదు కొన్ని శ‌తాబ్దాల నుంచి ఎంతో సంద‌డి ఉంటుంది. సంక్రాంతి వ‌స్తుందంటే చాలు అదో పెద్ద సంద‌డి. ఇక కొన్ని ద‌శాబ్దాలుగా సినిమాల‌కు కూడా సంక్రాంతి పెద్ద సీజ‌న్‌. సంక్రాంతికి కొత్త కొత్త సినిమాలు థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి చేస్తూ ఉంటాయి. ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వ‌డంతో థియేట‌ర్ల ద‌గ్గ‌ర జ‌నాలు పుష్క‌లంగా ఉండేవారు. సంక్రాంతికి హిట్ కొడితే ఆ మ‌జాయే వేరుగా ఉంటుంది.

ఇక 21 ఏళ్ల క్రితం అంటే 2001 సంక్రాంతికి ఒకేసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌రు ముగ్గ‌రు అగ్ర‌హీరోల సినిమాలు వ‌చ్చాయి. మెగాస్టార్ చిరంజీవి మృగ‌రాజు, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌ర‌సింహ‌నాయుడు, విక్ట‌రీ వెంక‌టేష్ దేవీపుత్రుడు సినిమాలు వ‌చ్చాయి. ఈ మూడు సినిమాలు ఒకేసారి రావ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హీటెక్కిపోయింది. ముగ్గురు హీరోల అభిమానుల హంగామా మామూలుగా లేదు. మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు జ‌న‌వ‌రి 11న రిలీజ్ అయితే, దేవీపుత్రుడు జ‌న‌వ‌రి 14న రిలీజ్ అయ్యింది.

చూడాల‌ని ఉంది హిట్ అవ్వ‌డంతో గుణ‌శేఖ‌ర్ – చిరంజీవి కాంబోలో వ‌చ్చిన మృగ‌రాజుపై ముందే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక అమ్మోరు, దేవి హిట్ త‌ర్వాత కోడి రామ‌కృష్ణ డైరెక్ట్ చేసిన గ్రాఫిక్ సినిమా కావ‌డంతో దేవిపుత్రుడిపై అంతే అంచ‌నాలు ఉన్నాయి. ఇక బాల‌య్య – బి.గోపాల్ కాంబినేష‌న్లో వ‌చ్చిన స‌మ‌రసింహారెడ్డి 1999 సంక్రాంతికి వ‌చ్చి హిట్ అవ్వ‌డంతో న‌ర‌సింహ‌నాయుడిపై అంతే అంచ‌నాలు ఉన్నాయి.

క‌ట్ చేస్తే 11న రిలీజ్ అయిన మృగ‌రాజు సినిమాకు తొలి ఆట‌కే డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చింది. న‌ర‌సింహానాయుడుకు తొలి ఆట‌కే బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ వ‌చ్చింది. ఈ సినిమా ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. హాలీవుడ్ సినిమా నుంచి స్ఫూర్తి తీసుకుని ఆ రోజుల్లోనే రు. 11 కోట్ల ఖ‌ర్చుతో తీసిన మృగ‌రాజులో న‌టించిన సింహానికే రు. 67 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారు. ఒక్క పాట కోస‌మే కోటి రూపాయ‌ల సెట్ వేశారు. ఈ సినిమా భారీ న‌ష్టాలు మిగిల్చింది.

ఇక రు. 6 కోట్ల బ‌డ్జెట్‌తో తీసిన న‌ర‌సింహ‌నాయుడు రు. 25 కోట్ల పై చిలుకు వ‌సూళ్లు రాబట్టింది. భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా న‌ర‌సింహ‌నాయుడు రికార్డుల‌కు ఎక్కింది. 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ సినిమా 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. కొన్ని థియేట‌ర్ల‌లో ఈ సినిమా 300 రోజులు కూడా ఆడింది.

ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి హీరో వెంక‌టేష్ కూడా బరిలోకి దిగారు.ఎంఎస్ రాజు నిర్మాణంలో వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కిన దేవి పుత్రుడుకు భారీ గ్రాఫిక్స్ కావ‌డంతో బ‌డ్జెట్ ఎక్కువైంది. ఈ సినిమా నిర్మాత ఎంఎస్‌. రాజుకు ఏకంగా 10 కోట్ల పైన న‌ష్టాలు వ‌చ్చాయి. అలా 2001లో జ‌రిగిన ముగ్గురు పెద్ద హీరోల ట్రైయాంగిల్ బాక్సాఫీస్ ఫైట్లో బాల‌య్య తిరుగులేని విజ‌యం సాధించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news