టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ట్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తోన్న సంగతి తెలిసిందే.
అనిరుధ్‌కు సౌత్ ఇండియా యూత్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇప్పటికే వై దిస్ కొలవెరి అంటూ చేసిన రచ్చను ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కిన బీట్ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. వ్యూస్ పరంగాను, లైక్స్‌లోనూ రికార్డుల దుమ్ము రేపుతోంది. విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అనిరుధ్ కంపోజ్ చేసిన అరబిక్ కుత్తు సాంగ్‌ను సినీ ప్రియులు పదే పదే విని ఎంజాయ్ చేస్తున్నారు.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సాంగ్ పిచ్చ పిచ్చగా వైరల్ అవుతూ ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు అనిరుధ్‌కు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ కోసం కూడా అరబిక్ కుత్తు రేంజ్లో ఓ సాంగ్ కంపోజ్ చేయాలని.. ఆ సాంగ్ అసలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు ఎప్పటకీ చరిత్రలో నిలిచిపోయే రేంజ్‌లో ఉండాలని సోషల్ మీడియాలో అనిరుధ్‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు.
అనిరుధ్ కోలీవుడ్‌లో ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినా తెలుగులో గొప్ప ఆల్బమ్ ఇవ్వలేదు. పవన్ సినిమాకు పనిచేసినా ఆల్బమ్ ప్లాప్ అయ్యింది. దీంతో స్టార్ హీరోలు అనిరుధ్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు అదిరిపోయే ఆల్బమ్ ఇస్తే కనుక అనిరుధ్ టాలీవుడ్‌లోనూ టాప్ హీరోల సినిమాలకు ఛాన్స్ దక్కించుకుంటాడని. ఇక్కడ కూడా ఓ ఊపు ఊపుతాడని అంటున్నారు.
ఈ సమ్మర్ లో ఈ సినిమాను పట్టాలెక్కించి ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ ప్రాజెక్టుగా ఇది తెరకెక్కుతోంది.