సినిమా రంగంలో ప్రేమ వ్యవహారాలకు కొదవే ఉండదు. ఈ తరంలో ప్రేమలు.. డేటింగ్‌లు అనేవి మామూలు అయిపోయాయి. అసలు ఈ ప్రేమల్లో గాసిప్‌లు ఎన్ని ఉన్నాయో కూడా ఎవ్వరికి తెలియదు. ప్రేమలు పెళ్లిళ్ల వరకు వెళ్లినా కూడా అవి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. ఓ హీరోయిన్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి.. చివరకు ఆ ప్రేమ బ్రేకప్ కావడంతో ఆ తర్వాత హీరోయిన్‌గా, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమె ఎవరో కాదు కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి.
కేవలం హీరోయిన్ రోల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లో ఇరగదీస్తూ మక్కల్ సెల్వి బిరుదును సొంతం చేసుకున్నారు. వరలక్ష్మి ఇంగ్లాండ్ లోని ప్రముఖ ఏడింబర్గ్ వర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేసి ముంబైలో నటనలో శిక్షణ పూర్తి చేసుకుంది. 18 ఏళ్ల వయస్సులోనే ఆమె శంకర్ దర్శకత్వంలో బాయ్స్ సినిమాలో నటించింది. అయితే తండ్రి ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాలో నటించలేదు.
శింబు హీరోగా వచ్చిన పోడా పొడీ (2012)లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆమెకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది. ఇక తన రెండో సినిమా విశాల్‌తో నటిస్తోన్న సమయంలోనే అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా వీరిద్దరే ప్రేమపక్షుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. అప్పుడు శరత్‌కుమార్‌కు వీరి ప్రేమ ఎంత మాత్రం ఇష్టం లేదు.
ఆ తర్వాత అయినా వీరు కలుస్తారు అనుకుంటే నడిగర్ సంఘం ఎన్నికలు విశాల్ – శరత్‌కుమార్ మధ్య మరింత గ్యాప్ పెంచేశాయి. అలా వీరిద్దరు విడిపోయినా ఇప్పటకీ స్నేహితులుగానే ఉంటున్నారు. అందుకు వీరిద్దరు విడిపోయాక వచ్చిన పందెం కోడి 2 ఉదాహరణ. అలా శరత్‌కుమార్‌కు ఇష్టంలేకపోవడంతోనే వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు.
విశాల్‌తో బ్రేకప్ తర్వాత కెరీర్ మీద కాన్‌సంట్రేషన్ చేసిన వరలక్ష్మి ఓ వైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఇరగదీస్తోంది. రవితేజ క్రాక్, నాంది సినిమాలు మంచి పేరు తీసుకువచ్చాయి. ఇక ఇప్పుడు తెలుగులో సమంత కీ రోల్ చేస్తోన్న యశోదతో పాటు బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమాలో కూడా ఆమె నటిస్తోంది.