Moviesప్రియుడి మోజులో భ‌ర్త‌ను వ‌దిలేసిన హీరోయిన్... ఎంత మంది ప్రియుళ్ల‌ను మార్చిందంటే...!

ప్రియుడి మోజులో భ‌ర్త‌ను వ‌దిలేసిన హీరోయిన్… ఎంత మంది ప్రియుళ్ల‌ను మార్చిందంటే…!

సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ‌లు, బ్రేక‌ప్‌లు, స‌హ‌జీవ‌నాలు.. పెళ్లిళ్లు, విడాకులు అనేవి ఇటీవ‌ల కామ‌న్ అయిపోయాయి. న‌చ్చితే స‌హ‌జీవ‌నాలు చేసుకోవ‌డం.. ఆ త‌ర్వాత వివాహాలు చేసుకోవ‌డం.. కొన్నాళ్లు కాపురాలు చేశాక‌.. న‌చ్చ‌కపోతే అంతే సింపుల్‌గా విడిపోవ‌డం జ‌రుగుతున్నాయి. కేవ‌లం ఈ తంతు సినిమా రంగంలోనే కాదు… దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్నీ సినిమా ఇండ‌స్ట్రీల్లోనూ జ‌రుగుతోంది.

ఇక హీరో, హీరోయిన్లు ఎప్పుడు క‌లిసి ఉంటున్నారో.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో.. ఎప్పుడు విడాకులు తీసుకుంటారో ? కూడా తెలియ‌ని ప‌రిస్థితి. కిమ్‌శ‌ర్మ ఈ పేరు గుర్తుండే ఉంటుంది. తెలుగులో కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో 2002లో వ‌చ్చిన ఖ‌డ్గం సినిమాలో శ్రీకాంత్‌కు జోడీగా న‌టించింది. ఓ సాంగ్‌లో కూడా న‌టించింది. రెండు ద‌శాబ్దాల క్రితం ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా పెద్ద‌గా పాపుల‌ర్ కాక‌పోయినా ప్రియుళ్ల‌ను మార్చే విష‌యంలో మాత్రం బాగా పాపుల‌ర్ అయ్యింది.

మొహ‌బ‌త్తే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కిమ్ తెలుగులో ఖ‌డ్గం సినిమా చేసింది. ప్ర‌ముఖ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌తో ప్రేమాయ‌ణంతో వార్తల్లోకి ఎక్కిన ఆమె యువ‌రాజ్‌తో చాన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసి విడిపోయింది. యువ‌రాజ్ త‌ర్వాత ఓ స్పానిష్ సింగ‌ర్‌తో డేటింగ్ చేసింది. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాక కూడా అత‌డితో బ్రేక‌ప్ చెప్పేసింది. త‌ర్వాత కెన్యాకు చెందిన వ్యాపార‌వేత్త ఆలీ పుంజాను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.

ఆలీ పుంజా వ‌య‌స్సులో కిమ్ కంటే చాలా పెద్ద‌వాడు. కేవ‌లం డ‌బ్బు కోస‌మే ఆలీని పెళ్లి చేసుకున్న‌ట్టు అప్పుడు అంద‌రూ కోడై కూశారు. ఆలీతో వివాహ బంధంలో ఉన్నా కూడా త‌న మాజీ ప్రియుడు యువ‌రాజ్ మీద ప్రేమ ఉండ‌డంతో ఇండియాకు వ‌చ్చి సీక్రెట్‌గా అత‌డిని క‌లుస్తూనే ఉండేది. యువ‌రాజ్ మీద ప్రేమ పెరిగిపోవ‌డంతో భ‌ర్త వ‌ద్ద‌న్నా విన‌కుండా 2017లో అత‌డికి విడాకులు ఇచ్చేసింది. ఈ క్ర‌మంలోనే భ‌ర‌ణంగా ఆమెకు కోట్లాది రూపాయ‌లు ముట్టాయి.

త‌ర్వాత ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అర్జున్ ఖ‌న్నాతో ఆ త‌ర్వాత తెలుగు సినిమాల‌తో కూడా ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం ఉన్న హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణేతో కూడా ఆమె ప్రేమాయ‌ణం కొన‌సాగించింది. ఏదేమైనా కార్ల‌ను మార్చినంత సులువుగా కిమ్ ప్రియుళ్ల‌ను మారుస్తూ వ‌స్తోంది. లియాండ్ పేస్‌తో కూడా ఆమె బంధం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news