భీమ్లానాయక్ సినిమా హడావిడి ముగిసింది. మొత్తానికి బొమ్మ హిట్టే.. మరి ఇది సూపర్ హిట్టు.. అంతకు మించిన బ్లాక్‌బస్టర్ హిట్టు అన్న వరకు వెళుతుందా ? లేదా ? అన్నది బాక్సాఫీస్ లెక్కలు తేలుస్తాయి. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీ వర్గాల్లో.. అన్నింటికి మించి భీమ్లానాయక్ సినిమా యూనిట్ వర్గాల్లో వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ టైంలో నిత్యామీనన్‌కు, యూనిట్‌కు మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని.. సినిమా రిలీజ్ అయ్యాక అది నిజమే అన్న టాక్ ఎక్కువుగా వినిపిస్తోంది.
వాస్తవానికి అయ్యప్పనుం కోషియమ్ ఒరిజినల్ వెర్షన్‌తో పోలిస్తే భీమ్లానాయక్లో నిత్యా స్పేస్ బాగా పెంచారు. థమన్ మెలోడీగా అంత ఇష్టం ఏందయ్యా నీకు అన్న సాంగ్ కంపోజ్ చేశారు. ఇదే పాట సినిమాలో ఉండి ఉంటే చాలా బాగుండేది.. సెకండాఫ్‌లో వీరకుమ్ముడు ఫైట్లలో ఒక ఫైట్‌ను లేపేసి ఈ సాంగ్ పెడితే నిజంగా ప్రేక్షకుడికి కాస్త రిలీఫ్ ఉండేది.. సినిమా చూసేవాళ్లకు మాంచి ఎంజాయ్మెంట్ ఉండేది. కానీ దాన్ని లేపేశారు.
ఈ పాట కూడా పెట్టి ఉంటే నిత్యామీనన్ పాత్ర ఇంకా బాగా హైలెట్ అయ్యేది. ఇదంతా ఒకటి అయితే అసలు త్రివిక్రమే ఈ సినిమాలో పవన్ పక్కన నిత్యామీనన్‌ను హీరోయిన్గా ఎంపిక చేయడంతో పాటు ఆయనే స్వయంగా ఆమెను అడిగారట. తాను పవన్ కళ్యాణ్ సినిమా అని ఒప్పుకోలేదని.. త్రివిక్రమ్ అడగడంతోనే ఒప్పుకున్నారని ఆమె ఓపెన్‌గానే చెప్పింది. ఆ తర్వాత ఏదో తెలియని గ్యాప్… సినిమాలో ఆమెపై షూట్ చేసిన పాటే పెట్టలేదు.. ఇందుకు త్రివిక్రముడే కారణం అంటున్నారు.
ఇక సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు ఆమెతో పాటే నటించిన సంయుక్త మీనన్ వచ్చింది. నిత్య మాత్రం రాలేదు. ఇక ముందు ఆమె పాత్ర హైలెట్ చేసినా.. మధ్యలో సినిమా టీంకు, ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్‌తోనూ ఆమెకు గ్యాప్ రావడం వల్లే ఆమెను తొక్కిపడేశారనే అంటున్నారు. బరువు పెరగడంతో ఇటీవల ఆమెకు అవకాశాలు రావడం లేదు. వాస్తవంగా ఆమె మంచి నటి.. భీమ్లానాయక్లో పవన్ పక్కన ఛాన్స్ వచ్చింది. ఆమెకు మంచి పేరే వచ్చినా ఇదిగో ఇలాంటి గ్యాప్ వల్లే ఆమెకు మరింత దెబ్బపడింది.