టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. యూత్‌లో విజయ్‌కు పిచ్చ క్రేజ్ ఉంది. ఇక నైజాంలో అయితే విజయ్ అంటే అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా పడి చచ్చిపోతున్నారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా లైగర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇక విజయ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడంతో పాటు బాగా కష్టపడ్డాడు. ఈ సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా పాన్ ఇండియా మార్కెట్లో విజయ్ దూసుకుపోతాడు.
ఇదిలా ఉంటే విజయ్ తాజాగా తనదైన స్టైల్లో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేసి తనపై కామెంట్ చేస్తోన్న వాళ్లకు గట్టి రిప్లై ఇచ్చాడు. కొద్ది రోజులుగా విజయ్ – రష్మిక మందన్న మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న ప్రచారం బాగా జరుగుతోంది. దీనిపై స్పందించిన విజయ్ ఒక లవ్ సింబల్ పెట్టి న్యూస్ పెట్టి అంతా నాన్సెస్ అని చెప్పాడు. విజయ్ పెట్టిన ఆ ట్వీట్ చూస్తూనే తనకు, రష్మిక మధ్య లింక్ ఉందని వస్తోన్న వార్తలపై ఇచ్చిన క్లారిటీయే అన్నది తెలిసిపోతోంది.
విచిత్రం ఏంటంటే కొన్ని ప్రముఖ వెబ్‌సైట్స్ కూడా ఈ విషయంపై క్లారిటీ లేకుండానే ఈ యేడాది చివర్లో రష్మిక – విజయ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రాసేశాయి. దీంతో ఈ ప్రచారం బాగా వైరల్ అవుతోంది. చిర్రెత్తుకొచ్చిన విజయ్ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో విజయ్ అసలు విషయం ప్రస్తావించకుండానే తనపై వస్తోన్న లవ్ మ్యాటర్‌కు ఎంచక్కా క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.
ఇక లైగర్ తర్వాత విజయ్ లైనప్‌లో భారీ, క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. అటు రష్మిక కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ టైంలో ఈ వార్తలు ఇద్దరి కెరీర్‌ను చికాకు పెట్టేవే. మొత్తానికి విజయ్ క్లారిటీతో గాసిప్ రాయుళ్ల నోళ్లకు తాళం పడినట్లు అయ్యింది.