సినీ సెలబ్రిటీలు ఏం చేసిన అది పెద్ద న్యూసలానే కనిపిస్తుంది. వాళ్లు నిల్చున్నా న్యూసే..పడుకున్న న్యూసే. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎక్కువ అయ్యాయి. సినీ సెలబ్రిటీలు అన్నాక జాగ్రత్తగా చూసుకోవాలి..వాళ్లు బయట కనిపిస్తే క్లిక్ మనిపిస్తున్నారు ఫోటోలు. ఇక అ ఫోటోలో ఏదైన తేదా క్స్నిపించిందనుకోండి..అమ్మడు పై నెట్టింత ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకే సెలబ్రిటీలు అన్నాక కూసింత జాగ్రతగా నడుచుకోవడం మంచిది. లేదంటే తేడాలు వచ్చేస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు అలాంటి ప్రబ్లం నే ఫేస్ చేస్తుంది ఈ బాలీవు బ్యుటీ ఊర్వశి రౌతేలా .
హిందీ సినిమాల్లో ఎలాగైనా క్రేజ్ తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా. ఇప్పటికే అక్కడ ‘సనమ్ రే’ ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ ‘హేట్ స్టోరీ 4’ లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించిన పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే వీలు చిక్కినప్పుడల్ల అందాల ఆరబోతతో అభిమానులను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది. కాగా రీసెంట్ గా అమ్మడుకి సంబంధించిన ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇటీవల క్లిక్‌మనిపించిన కొన్ని ఫొటోల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఊర్వశి రౌతేలా మెడ మీద ఎర్రటి మరక కనిపించింది. ఇంకేముంది.. ఓ వెబ్సైట్ హద్దులు దాటి మరీ ఊర్వశి మెడపై లవ్ బైట్ అంటూ రాసేసింది.
ఊర్వశి ఫొటోలు షేర్ చేసి ఆమె మెడపై ఉన్న ఎర్రటి మార్క్స్‌ని టార్గెట్‌గా చేసింది. ఆమె మెడపై ఉన్నవి లవ్ బైట్స్ అని రాసుకొచ్చింది. ఆమె ఎవరితోనే ప్రేమలో ఉందని వార్తల్లో పేర్కొంది. ఆ వార్తలు కాస్త నెట్టింట వైరల్ కాగా.. అది చూసిన ఊర్వశి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రహించిన ఊర్వశి సదరు కథనానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆమె పోస్ట్ చేస్తూ..’హాస్యాస్పదంగా ఉంది! అది నా రెడ్ లిప్‌స్టిక్, మాస్క్ తీస్తూ పెడుతున్నప్పుడు అది నా మెడకు అంటింది. పెదాలకు రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకున్న తర్వాత దాన్ని మెయింటెన్ చేయడం ఎంత కష్టమో ఏ అమ్మాయిని అడిగినా చెప్తుంది. ఒకరి ప్రతిష్టను దిగజార్చడం కోసం ఏదిపడితే అది రాస్తారా? ఇలాంటి ఫేక్ న్యూస్‌లు రాసే బదులు నా విజయాల గురించి రాయొచ్చు కదా?’ అని ట్వీట్ చేసింది. అంతేనా ఆ వెబ్ సైట్ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలిసిందే అంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.