మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎంతో మంది కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. చిరంజీవి సినిమాల ద్వారానే ఎంతో మంది కొత్త నటీనటులు, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలు కూడా పరిచయం అయ్యారు. అలాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కూడా సమసమాజ స్థాపన కోసమే ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఎన్నికల్లో గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే ఆయన టిక్కెట్లు ఇచ్చింది మాత్రం సమాజ స్థాపనలో భాగంగానే..! ఎంతో మంది బడుగు, బలహీన వర్గాలు, సామాన్యులకు సైతం ఆయన టిక్కెట్లు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని కోవూరులో సాధారణ మహిళ అయిన తుపాకుల మునెమ్మకు చిరు జనరల్ సీటును ఇచ్చారు. ఆమె ఎస్టీ మహిళ కావడం విశేషం.
ఈ క్రమంలోనే చిరంజీవి 2009లో తన ప్రజారాజ్యం పార్టీ ద్వారా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు స్వయానా అత్త గారు అయిన నూర్జహాన్‌కు కూడా టిక్కెట్ ఇచ్చారట. ఈ ఇంట్రస్టింగ్ స్టోరీలోకి వెళితే.. నితిన్ గతేడాది శాలినిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయ్యాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న నితిన్ – శాలినికి పెళ్లి జరగడంతో నితిన్ బ్యాచిలర్ లైఫ్‌కు ఎండ్ కార్డు పడింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయంతో వీరి మధ్య ప్రేమ చిగురించి చివరకు పెళ్లిగా మారింది.
కరోనా పాండమిక్ టైంలోనే నితిన్ తక్కువ మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో శాలినిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల శాలిని కరోనా భారీన పడి కోలుకుంది. ఇక శాలిని కుటుంబానికి – చిరంజీవికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం ఏంటంటే.. నితిన్ తల్లితండ్రులు సంపత్ షేక్ – నూర్జహాన్‌లది ప్రేమ వివాహం. వీరు కర్నూలులో 20 ఏళ్లుగా ఓ హాస్పటల్ పెట్టి ఫేమస్ వైద్యులుగా స్థిరపడ్డారు.
2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున నూర్జహాన్‌కు కర్నూలు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే అప్పటి నుంచి కూడా చిరంజీవికి, నూర్జహాన్ దంపతులకు మధ్య స్నేహం ఉంది. అలా నాడు హీరో చిరంజీవితో పరిచయం ఏర్పడగా.. ఆ తర్వాత ఇప్పుడు యంగ్ హీరో నితిన్ వాళ్లింటి అల్లుడు అయ్యాడు.