Moviesటాలీవుడ్ ద‌శ - దిశ‌ను మార్చేసిన ' శివ ' సినిమాకు...

టాలీవుడ్ ద‌శ – దిశ‌ను మార్చేసిన ‘ శివ ‘ సినిమాకు ఇంత చ‌రిత్ర ఉందా..!

తెలుగు సినిమా చరిత్రను శివకు ముందు శివకు తర్వాత అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటారు. శివ ఇది మన తెలుగు సినిమా అని ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అసలు ఈ సినిమాలో అంత గొప్ప కంటెంట్ ఏముంది ? ప్రేక్షకులకు అంత పిచ్చిగా ఎందుకు నచ్చిం..ది ఆ రోజుల్లో తెలుగు యువతను శివ ఎలా మాయ‌చేసిందో చూద్దాం. శివ సినిమా వచ్చి ఇప్పటికి మూడు దశాబ్దాలు దాటుతున్నా కూడా ఆ సినిమా క్రేజే నాగార్జునకు యువతలో తిరుగులేని ఇమేజ్ ఇచ్చింది. శివ సినిమాతోనే రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. రాంగోపాల్ వర్మకు ఇదే తొలి సినిమా.. డెబ్యూ దర్శకుడు కావడంతో ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు.

పైగా నాగార్జున అప్పటికీ ఏఎన్ఆర్ కుమారుడే అయినా… ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మార్చేసిన గొప్ప సినిమాలేవీ ఆయన కెరీర్లో లేవు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులకు కానీ… ఆ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ కు కాని… ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకాలు లేవు. అసలు వర్మ డైరెక్షన్ ఏం చేస్తున్నారో ? కూడా ఆయన కింద ఆ సినిమాకు పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా అర్థం కాని పరిస్థితి.

1989 అక్టోబర్ 5న రిలీజ్ అయిన శివ వారం రోజులపాటు పెద్దగా ఆడదు అన్న టాక్‌తోనే థియేటర్లలో నడిచింది. రెండో వారం నుంచి శివకు సూపర్ హిట్ టాక్ బాగా స్ప్రెడ్‌ అయింది. ప్రేక్షకులు ఈలలు వేసి చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయి తెరకు అతుక్కుపోయి మరి ఈ సినిమాను చూశారు. ఇప్పటివరకు ఒక లెక్క… ఇక ముందు ఒక లెక్క అంటూ సైకిల్ చైన్‌తో కొట్టి మరి చెప్పింది శివ సినిమా. ఈ సీన్ ఇప్పటికీ యువతలో చర్చకు వస్తూనే ఉంటుంది. ఈ సీన్ ఆలోచన వెనుక నాడు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి… తర్వాత స్టార్ డైరెక్టర్ అయిన‌ తేజ ఆలోచన ఉంది.

తెలుగు సినిమా చరిత్రలో నవతరం సినిమాగా ఓ నూతన శకానికి శ్రీకారం చుట్టింది శివ. సిడ్‌ఫీల్డ్‌ స్క్రీన్ ప్లే చదవటం.. సినిమా చూడ‌డం ఒక్క‌టే అన్న‌ట్టుగా ఈ సినిమా ఉంటుంది. శివ సూపర్ హిట్ అయ్యాక రామ్ గోపాల్ వర్మపై బాలీవుడ్ వరకు కూడా విపరీతమైన నమ్మకం కుదిరిపోయింది. రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టేశాడు. శివ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో రామ్ గోపాల్ వర్మ ఓ దశాబ్దం పాటు బాలీవుడ్లో సెటిల్ అయిపోయాడు. శివ సినిమాలో ఒక సన్నివేశం కూడా అర్టిఫిషియ‌ల్‌గా, సినిమాటిక్‌గా ఉండదని చెప్పాలి. బయట జరుగుతున్న సంఘటనలను మనం చూస్తున్నట్టుగా ఉంటుంది.

సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సినిమాలో ఉన్న పాత్రలు.. కెమెరా వర్క్ అన్ని అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న మూస ధోరణులకు పూర్తిగా చెక్ పెట్టే సాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు కాలేజీ లో ఎక్కడ గొడవ జరిగినా విద్యార్థులు సైకిల్ చైన్ తీసుకుని చేతికి చుట్టుకుని రావటం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక హీరో.. హీరోయిన్లుగా నటించిన నాగార్జున – అమల తర్వాత కాలంలో రియల్ దంపతులు అయ్యారు.

శివ సినిమా హిట్ అయ్యాక నిర్మాతగా ఉన్న అక్కినేని నాగేశ్వర రావు ఒక రోజు రామ్ గోపాల్ వర్మను పిలిచి ఫస్ట్ సినిమా హిట్ అయింది కదా పత్రికలకు ఒక యాడ్ ఇవ్వమని చెప్పారట. అయితే అందుకు బదులుగా వర్మ నేను యాడ్ ఎందుకు ఇవ్వాలి అండి.. వాళ్లకు మంచి హిట్ సినిమా ఇచ్చాను కాబట్టి ప్రేక్షకులే నాకు థ్యాంక్స్ చెబుతూ యాడ్ ఇవ్వాలని సరదాగా చమత్కరించారట. ఏదేమైనా ఓ దశాబ్దం పాటు శివ సినిమా ప్రభావం టాలీవుడ్ పై గట్టిగా పడిందని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news